Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Saturday, April 22, 2017

నిన్నుజూసి నాక్ చానా జెలస్ ఫీల్ ఐతుంది రా

లాస్ట్ 10 డేస్ ల నేను పెళ్ళిచూపులు నాలుగు సార్లు చూశ్న. ఏమన్నా సైన్మా నా అది. ఫిదా వాయ్ నీ మీద. వెస్ ఆండర్సన్ తీసిన బాటల్ రాకెట్ గురించి స్కొర్సెసె ఒక చోట అంటడు, Here was a picture without a trace of cynicism, that obviously grew out of its director's affection for his characters in particular and for people in general. A rarity. నీ సినిమా చూసి నాక్ అదే ఫీలింగ్ కలిగింది. ఎంత ఇష్టంగ రాసినవ్ ప్రతీ సీన్ అని. మొన్న రాత్రి స్కూల్ ఫ్రెండ్ గాంతో మాంచి హై మీద పొద్దుగాల మూడింటిదాక డిస్కషన్ పెట్టినా నువ్ ఎంత తోప్ అని. అంత పాషన్ తోటి దేని గురించన్నా మాట్లాడి చాలా ఏళ్ళైపోయింది. చిత్ర వాళ్ళ బామ్మ ఒక్క డయలాగ్, "దీనికి అన్నీ పెళ్ళిచూపులు ఆటలా అయిపోయాయి. నా సీరియళ్ళన్నీ మిస్ అయిపోతున్నాయి", చాలు నీ ఫిల్మ్ మేకింగ్ ఎంత సీరియస్ ఓ చెప్పటానికి.

ప్రతీ కారెక్టర్ కి ఒక ఆర్క్. పెళ్ళిచూపులు చూసేంత వరకూ నాకు స్ట్రైక్ కాలేదు వేరే సినిమాల్లో సీన్స్ అంత ఫ్లాట్ గా ఎందుకు ఉంటాయో- ఈ సినిమాలో ప్రతీ కారెక్టర్ వాడి ప్రమంచంలో వాడుంటాడు. ఈ స్క్రీన్ రైటింగ్ గురువులు చెప్పినట్టు నువ్వు ప్రతీ పాత్రకీ ఒక మోటివ్, ఒక పర్సనాలిటీ ట్రైట్, ఒక ఓబ్స్టకల్ ఇచ్చావ్. అసలు సినిమా అంటే ఇలా రాయాలి అన్నంత అక్కంప్లిష్డ్ రచన ఇది.

కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఈ పర్ఫెక్షన్ కొంచెం constraining గా అనిపించింది. నీ జర్నీ చూసిన రోజే అనిపించింది, వీడెవడో నాచురల్ ఫిల్మ్ మేకర్, ఆ ఐ ఉంది అని. సైన్మా చూసి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పాటికి కూడా నెలకి ఒకసారైనా ఆ లేపుకెళ్ళే సీన్ గురించి మాట్లాడతా. ఇప్పుడు పెళ్ళిచూపులు. ఎక్కడ్నో ఒకసారి చదివినా నీకు మణి రత్నం అంటే చాలా ఇష్టం అని. ఆ ట్రేసెస్ కనబడతాయి- అర్బన్ మధ్య తరగతి సెన్సిబిలిటి. బరద్వాజ్ రంగన్ మణి రత్నాన్ని మన లాస్ట్ మెయిన్-స్ట్రీం auteur అంటాడు. అతను అప్పటికి నీ వర్క్ ఇంకా చూడలేదనుకుంటా. పర్సనల్లీ, ఐ విష్ నీ మూవీస్ కుడ్ బి స్లైట్లీ zanier. Talking about a Nolan film, someone wrote that his films are like the click of a perfectly made box. నీ సినిమాలు కూడా అట్లనే. నాకు ఆ పర్ఫెక్షన్ slightly off-putting కానీ అది నా ప్రిఫరెన్స్ మాత్రమే. నాకు అనురాగ్ కశ్యప్, సెల్వరాఘవన్ ల మెస్సీనెస్ ఇష్టం.

సో హా, ఏం మాట్లాడుతున్నం? జెలసీ గురించి. పెళ్ళిచూపులు ఫస్ట్ డే చూసి గట్టుగాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, "చూడు బా సినిమా. అల్టిమేట్ ఉంది. నువ్వు తీద్దాం అనుకున్న సినిమా ఈడు తీసేసాడు". మన గురించి, మామూలు మనుషుల గురించి ఎందుకు రా ఎవడు సినిమాలు తీయడు అన్న నా పెరీనియల్ ఫిర్యాదు కి ఆన్సర్ ఈ సినిమా. కళ మనిషిని ఇన్స్పైర్ చేయాలి అంటరు కదా, నీ సినిమా నన్ను ఇన్స్పైర్ చేస్తది. నా సినిసిస్మ్ ని కాసెపటికైనా పోగొడ్తది. జనాలు ఎంత ఇష్టంగా, ఓన్ చేస్కొని ఈ సినిమాని తమ సొంత సినిమాలా నలుగురికీ చూడమని చెప్పారో చూస్తే చాలా మంచిగ అనిపించింది.  ఎట్ల తీష్నవ్ బాబు ఇంత మంచి సినిమా?

పండగ పూట కుటుంబం అంతా అన్నాలు తినేసి ఈ.టివి లో మిస్సమ్మ, గుండమ్మ కథ కబుర్లు చెప్పుకుంటూ చూస్తరు కదా, అట్ల పాతికేళ్ళ తరవాత నీ సినిమాని చూస్తరు. తెలుగోళ్ళ కల్చరల్ జిందగీల నీ సినిమాలు ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నీ గురించి తెల్వద్ కానీ నాక్ మాత్రం మస్త్ గర్వంగున్నది; అదేదో నేనే తీసినట్టు.

అదీ ముచ్చట. నేనేదన్నా ఇట్ల చేయగలనూ, చేస్తానూ అన్న నమ్మకం పోయింది. ఏదో నిస్సత్తువ, సినిసిస్మ్, చిరాకు, రెస్ట్ లెస్నెస్స్. కానీ ఆ ఎమోషన్స్ ని కాసేపటికైనా దూరం పంపింది నీ సినిమా. దానికి థాంక్స్. If they’re responding to your work and your work is really personal, then reading you is another way of meeting you, అంటాడు లిప్స్కీ ఫాస్టర్ వాలేస్ తో. నేనూ ఆ మాట తో ఏకీభవిస్తాను. నీ గురించి అంతా తెలియక పోయినా నీ innate dignity, honesty ప్రతిబింబిస్తాయి నీ సినిమాలో.

నాక్ జెనెరల్ గా తారీఫ్ చేయటం ఈసీగ రాదు. నా ఈగో అడ్డొస్తది. కానీ నీ కేస్ లో ఆ ఈగో annihilate అయిపోయింది. మంచిగ రాసిన పుస్తకం, సినిమా చదివితే, చూస్తే అనిపిస్తది బానే తీసాడు కానీ మనం భీ తీయొచ్చు పెద్ద గొప్పేంది అని. కానీ కొన్ని అట్లా ఉండవు. అవి మన రేంజ్ కాదు అని సమఝ్ అయిపోతది. అదీ ఒక రకంగ మంచిదే- ఖులే దిల్ తోని మెచ్చుకుంటం. అది నువ్వు నాకు చేసిన పెద్ద ఎహ్సాన్. జెన్యూన్ మంచితనాన్ని, స్వార్థం లేని ప్రశంసని నా నోట్లో నుండి రావటం చూసి నేనే ఆశ్చర్యపోయా.

నేన్ జీవితంలో ఏదన్నా, ఎప్పుడైనా ఇష్టంగా, ప్రేమగా, గర్వంగా సృష్టిస్తే దానికి పెద్ద స్ఫూర్తి నీ సినిమాలు అవుతాయి.

సలాం తరుణ్.

Thursday, December 8, 2016

సాయంకాలమైంది గురించి కొన్ని మాటల్లో

తెలుగులో చాలా గొప్ప సాహిత్యం ఉందని విన్నాను. వాటిల్లో చాలా తక్కువ వాటి గురించి తెలుసు. ఆ తెలిసిన చిన్న జాబితాలో కూడా కొన్నే చదివాను- చలం మైదానం, శ్రీశ్రీ మహాప్రస్థానం, శ్రీ రమణ మిధునం. ఇప్పుడు ఆ జాబితాలో గొల్లపూడి మారుతీరావు గారి సాయంకాలమైంది ని జోడిస్తున్నాను. ఈ పుస్తకానికి సాహితీ విమర్శ చేసేంత స్థాయి నాకు లేదు; అయినా ఈ గొప్ప రచన గురించి కొందరికైనా చెప్పాలన్న తాపత్రయం ఉంది. అందుకేనేమో పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఉన్న అనేక extraordinary snippets లో కొన్నిటికి ఎంత చలించిపోయానంటే చాలా మందికి ఆ screenshots పంపాను. చదువు నీకు చాలా నచ్చుతుంది అని అమ్మ అన్నప్పుడు దాని ప్రభావం నా మీద ఇంత ఉంటుందని నేను ఊహించలేదు. థాంక్యూ మా.

కథ దేని గురించి- శ్రీ వైష్ణవ సాంప్రదాయం లో పరమ నిష్ఠా గరిశ్ఠులైన ఒక పురోహితుల కుటుంబం నేపధ్యం. అందులో సుభద్రాచార్యులు అనే ఒక మహానుభవుడు. ఆయన తన తరంలో చూసిన మార్పులు- అలవాట్లల్లో, సాంప్రదాయాల్ని పాటించే తీరులో, సమాజంలో, కుటుంబీకుల మధ్య బాంధవ్యాలలో. దీని చుట్టూ ఒక అద్భుతమైన కథని అల్లారు గొల్లపూడి గారు. సుభద్రాచార్యుల గారి జీవితాన్ని పీఠం గా చేసుకొని చాలా విషయాల మీద సాంఘిక వ్యాఖ్యానం చేసారు. హిందూ తత్వజ్ఞానం గురించి చర్చించారు, అమెరికా వలసల కి అద్దం పట్టారు, తల్లితండ్రుల-పిల్లల అనుబంధాల fabricని దగ్గర నుండి చూపారు, సాయం గురించి మాట్లాడారు, గొప్పవాడెప్పుడూ మంచివాడవ్వాల్సిన అవసరం లేదని చెప్పకుండానే తెలియజేసారు. అంతమైపోతున్న సాంప్రదాయ ఆచారాల నిర్వహణ కళ్ళకట్టినటు చూపించారు.

వీటన్నింటి గురించి ప్రస్తావించటం ఒక ఎత్తు- ఇది ఆయన మేధా సంపత్తికి తార్కాణం. కానీ ఆ విషయాలన్నీ ఇంత మంచి కథలో ఇంత అందంగా అల్లటం చాలా మంది తరం కాదు. గొల్లపూడి వారి వచనం కైంకర్యాం చేసిన వేడి వేడి చక్కెరపొంగలి లాంటిది- రుచి అమోఘం, తన్మయత్వం నిశ్చితం. ఎన్నో పాత్రలు, ప్రతీ పాత్రకీ ఒక అనన్యత. రెండే వ్యాఖ్యాల్లో పాత్రని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ప్రతి మనిషీ వాడి వాడి మనస్తత్వాన్ని బట్టి, కర్మ ఫలాల బట్టి జీవితం నడిపిస్తాడు. అది నిజం, అదే నిజం- మంచి చెడులు నిర్ణయించటానికి మనమెవరం. ఆయన రచనలో judgement ఉండదు, sympathy ఉంటుంది- అదొక benign realism.

మారుతీరావు గారి మీద నాకున్న ఒకే ఒక చిన్న అభియోగం ఆయన అకస్మాత్ authorial intervention. కథ మధ్యలో ఆయన వృత్తాంతాన్ని తెంపుతూ ఒక పేరా మన ప్రస్తుత జీవనశైలి మీద చిన్న aside లాగా రాస్తారు. ఈ కథ ముందు సీరియల్ గా ప్రచురింపబడినందుకేమో అప్పట్లో ఇది అంత కొట్టొచినట్టు కనబడుండదు కానీ పుస్తక రూపంలో సరిగ్గా ఇమడలేదు. అయినా ఏదో పితూరి చెప్పాలని చెప్తున్నాను కానీ ఇది పున్నమి చంద్రుడిలో మచ్చలు చూపటం లాంటిది. అది మనలోని లోపాలకు అభివ్యక్తం మాత్రమే.

ఈ పుస్తకం గురించి నేను చెప్పేదంతా superficial. కుండలో చంద్రుడి ప్రతింబింబం చూపినట్టు. నాలాంటి న్యూస్పేపర్ చదివే అత్తెసరి గాడికే అర్థం అయ్యిందంటే ఎవరైనా చదవచ్చు. మీరే చదవండి- మీలో వొచ్చే మార్పు కి మీరే సాక్ష్యం.

Monday, October 12, 2015

సోల్ మెట్

I wrote this story last October. For Kinige Smart Story Competition. Word limit of 750 words. I spent more than a month wiling away, searching for ideal topics. On the day of the deadline, I went to watch Karthikeya because Bujji mama wanted me to watch and let him know how the film was. I parked my bike outside the theatre to save ten bucks and left my helmet with the bike. And then, this happened. 

--

ఈరోజు నా హెల్మెట్ పోయింది. సినిమా థియెటర్ బయట పార్క్ చేస్తే ఎవరో కొట్టేసారు. నేను చీకట్లో నవ్వుతూ, బాధపడుతూ, భయపడుతూ సినిమాలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఎవరో బయట దాన్ని దొంగలించారు. నా హెల్మెట్ - గీతలు పడ్డ వైజర్ తో, వెనక ఊడిపోతున్న స్టిక్కర్లతో, అన్ని వైపులా ఉన్న గాట్లతో, నాతో ఎల్లవేళలా ఉన్న హెల్మెట్ ఈరోజు పోయింది. గత మూడేళ్ళుగా నన్ను రక్షిస్తూనో, నాకు అపాయింటుమెంటు ఇచ్చిన వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు నా బాగ్ కి వేళాడుతూనో, లేక నేను తనని బైక్ కి తగిలించి గంటలు గంటలు మరిచిపోతే నాకోసం ఓపిగ్గా యెదురు చూస్తూనో ఉండేది. నేను బండి మీద వెళుతున్నప్పుడు పాటలు పాడుతున్నా, లేక పగటి కలలు కంటూ ఎన్నో గంటలు నాతో నేనే మాట్లాడుతున్నా విసుక్కోకుండా వినేది. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం యెదురు చూస్తూ తన మీద డ్రమ్స్ వాయిస్తే నవ్వేది, అర్జెంటు పని ఉండి రోడ్డు మీద విపరీతమైన ట్రాఫిక్ లో ఇరుక్కు పోయి ఏం చేయాలో తెలియక, ఆ కోపాన్ని తన మీద చూపిస్తూ తనని కొడితే మౌనంగా భరించేది. 

తను నా నిరంతర సహచరిగా ఉండి, నా కోపాలనీ, సంతోషాలనీ నాతో పాటు అనుభవిస్తూ, నన్ను తన protective veil నుండి జీవితాన్ని చూడనిచ్చింది. అర్థ రాత్రులలో హఠాత్తుగా వచ్చే భయంకరమయిన లారీ హార్న్ లను వింటే నేను బెదురుతానని, వాటిని నా వరకు రానివ్వకుండా తాను ఇంకించుకునేది. నేను తనచే కల్పించబడిన సురక్షితమయిన స్థానం లో రంగు రంగుల కలలు కంటున్నప్పుడు, తను ఎండలో, వానలో తడుస్తూ నన్ను కాపాడేది. మేమిద్దరం కలిసి పాటలు వింటూ, తలాడిస్తూ ప్రయాణిస్తునప్పుడు నా earphones పోలీసులకు కనబడ కుండా దాచేసేది. మేము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, వెరైటి మనుషులని చూసి జోకులేసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటే వాళ్ళు చూడకుండా నా చూపులనీ, నవ్వులనూ దాచేసేది. ఈ  విషయాలన్నీ నాకప్పుడు తెలీవు, తను నాకెప్పుడూ తెలియనివ్వలేదు. తను లేక ఇప్పుడు ఇంటికొస్తూంటే తెలిసొచ్చాయి. అన్నిటి కన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని రోజుల్లో తనని ఒక్కసారి కూడా నేను ఆప్యాయంగా నిమిరి, ఎలా ఉన్నావు అని అడగలేదు; ప్రేమగా పలకరించలేదు.

గమ్మత్తయిన సంగతి ఏంటంటే ఇప్పుడు నేను తన స్పర్శని ఫీల్ అవ్వగలుగుతున్నాను. నా చెంపల మీద తన గట్టిబడి పోతున్న ఫోం, నా మెడ దెగ్గర ఊగిసలాడుతున్న తన స్ట్రాప్, నా ఊపిరి నిండా తన వాసన పరిమళిస్తోంది. ఇప్పుడు నేను చేయి జాపితే, తన వీపుమీదున్న సగం ఊడిన Studds స్టికర్ ని తాకగలుగుతాను. ఇప్పుడు తను నా కళ్ళెదురుగానే ఉంది, ఒంటి నిండా దెబ్బలతో మచ్చలతో, ఆ సగం విరిగిన వైజర్ ఎడమ స్క్రూతో. తన లాగ ఎన్నో వేల హెల్మెట్లు తయారై ఉండుంటాయి, ఒకప్పుడు అచ్చం తనలాంటివే. వాటన్నింటిలో నుండి తను నా జత అయ్యింది- యాదృచ్ఛికమేనా? మా ఈ మూడేళ్ళ కాపురంలో, మేము కలిసి గడిపిన యెన్నో వేల ఘడియల్లో తను నా సొంతమైంది. ఎన్నో సార్లు తను సర్దుకుపోతూ నన్ను perfect గా accomodate చేసింది. అప్పుడప్పుడూ అనిపించేది, తను నా ఆలోచనలను చదవగలిగేదేమోనని, నా అవసరాలను నాకన్నా ముందే పసిగట్టేదేమోనని. నేను వైజర్ పైకెత్తి బండి నడుపుతున్నప్పుడు, హఠాత్తుగా దుమ్మూ పొగ వస్తే, నేను వైజర్ దించుదాము అనుకునే లోపు, అప్పటి దాకా firm గా clamp అయ్యి ఉన్న వైజర్ ఠక్కున కిందికి జారేది.

తను ఎప్పుడూ నాతోనే ఉంది, ఎప్పుడూ తోడు వీడలేదు. కానీ ఈరోజు నేను నా నిర్లక్ష్యం వలన తనని పోగొట్టుకున్నాను. తను నా కోసం ఎదురు చూస్తునప్పుడు, నేను తన గురించి మరిచిపోయాను. నేను తనని థియెటర్ లోనికి తీసుకు వెళ్ళి ఉండవచ్చు కానీ తనొక భారం అనుకున్నాను. నేను తనని బండికి లాక్ చేసి ఉండవచ్చు కానీ తనని ఎవరు తీసుకెళతారులే అనుకున్నాను. పాతపడిన, నిండా గాట్లున్న హెల్మెట్టే కదా, ఎవడు పట్టుకుపోతాడులే అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. నా నిర్లక్ష్యం మా ఇద్దరినీ ఇంత బాధ పెడుతుంది అని నేను ఊహించలేదు. ఎవడో తనని బండి నుండి తీస్తునప్పుడు, తీసుకొని నడుస్తూ వెళ్ళిపోతునప్పుడు, తను నా కోసం పిలిచినప్పుడు నేను తన దగ్గరకు పరుగుతీయలేదు. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, సినిమా చూస్తునప్పుడు, సెకండ్ హాఫ్ లో గుండె చివుక్కుమంది, నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. 

తను ఈరోజు దూరమవుతుందని ముందే తెలిసున్నాబాగుండేదేమో. తనకి బై చెప్పే అవకాశం కూడా దొరకలేదు- థాంక్యూ చెప్పుండే వాడిని, తనంటే నాకెంత ఇష్టమో చెప్పుండే వాడిని, తను నా జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేసే వాడిని. తను ఇప్పుడెక్కడున్నా నా గురించే ఆలోచిస్తూంటుంది, కొత్త వాళ్ళ నడుమ భయపడుతూంటుంది, నా రాక కోసం ఎదురు చూస్తూంటుంది. నాకు తెలుసు. 
నా ఈ ఆరాటం తనని చేరితే బాగుండు. ఎందుకంటే తనకి ఈ మాటలని విని అర్థం చేసుకొని, స్పందించే హృదయముంది. అదేంటో, ఇన్ని రోజులూ తనని ఏ పేరుతోనూ పిలవలేదు. ఆ అవసరం రాలేదు. మా ఇద్దరి సమక్షంలో నేను మాట్లాడిన మాటలన్నీ తనకేనని మా ఇద్దరికీ తెలుసుననేమో. 


నాకెంత బాధగా ఉందంటే తను రోజూ ఉండే స్టూల్ వంక కూడా చూడలేక పోతున్నాను. హెల్మెట్ పోయిందని ఏడుస్తున్నాను అంటే జనాలు నవ్వుతారని ఏడుపాపుకుంటున్నాను. అయినా పిచ్చి జనం, వాళ్ళకేం తెలుసు మా అనుబంధం. నువ్వు తొందర్లోనే దొరకాలని దేవుడికి మొక్కుకుంటాను. అప్పటి దాక, నన్ను గుర్తుంచుకుంటావు కదా సోల్ మెట్?

Tuesday, September 7, 2010

అంత కమ్ముల మహత్యం

This has been waiting to come out since ages. But sad telugu editor and I don't think a lot of it is comprehensible. Give it a shot though, but if you can't do it, revert to the english version right below this.

--

తెలుగు. ఎన్ని రొజులైందొ తెలుగులొ రాసి. బ్య్ థె వయ్, ఇప్పుదు నెను రాసె దనిలొ, కొన్ని చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్తకెస్ ఉందొచు ఎందుకంతె నెను వదెది త్రన్స్లతొర్ కబత్తి.
రొఫ్ల్! ఒకప్పుదు ఎంగ్లిష్ రాక తెలుగు మత్లదె వదిని, ఎక్ష్ప్రెస్స్ చెయదానికి తెలుగు పదాలు ఉసె చెసె వద్ని కాని ఇప్పుదు, ఇ దొణ్త్ క్నౌ అది చొఇచె ఆ లెక పొథెయ్ కవలని చెఉకున్న అలవతొ గాని, ఎక్కువ షాథం ఆలొచించదం కుద ఎంగ్లిష్ లొ నెయ్ అవుతొంది. అంద్ థిస్ ఫ్రిగ్గిన్ ఎదితొర్ సుచ్క్స్. హంగ్ ఒన్.

అన్య్వయ్, ఇ చణ్త్ సీం తొ ఫింద్ నొ బెత్తెర్ ఎదితొర్, బా, ఈ ఒకసరికి అద్జుస్త్ ఐపొంది, నెక్ష్త్ తిమె నించి స్పెల్లింగ్ మిస్తకెస్ లెని చ్లేన్ తెలుగు చదువుదురు గాని

నువ్వెన, నా నువ్వెన
నువ్వెనా, నాకు నువ్వెన
సుర్యుదల్లె, సూధి గుచె..

ఎందుకు దెవుద వెతురిని తీసుకెల్లిపొయవ్. జనలు చొర్రెచ్త్ ఎయ్ అంతరు, ఉంతెయ్ వలుఎ తెలియదని. ఆయన ఉన్నన్ని రొజులు, ఎప్పుదు గుర్థు చెస్కొలెదు. పొయక, యె పాత విన్న ఆయనె మదిలొ. బ్త్వ్, ఈ పొస్త్ ఎయ్ దాని గురించెయ్. వల్ల గురించి ఎవరైథెయ్ నాలొ, నెను తెలుగు వాద్నిని అని గుర్థుచెసరొ. ఈం నొత్ సయింగ్ అందుకె ఈ రెవొలుతిఒన్ అంథ. నా గురించి నాకు తెలుసు. ఎక్ష్తెర్నల్ ఫొర్చెస్ నన్ను కొంచం దూరం వరకె నన్ను పుష్ చెయ్యగలవు; ప్రొబబ్ల్య్ ఎవరినైన. కాని ఒక పొఇంత్ లొ నెనె రేలిజె అయ్య, ఎంథ వెరెవి ఎంథ పిచైన, నెను మనస్పూర్థిగ పదుకునె ముందు నాకు తెలుగు పత, తెలుగు కథ లెక తెలుగు చినెమ నె ఆ చొంప్లెతెనెస్స్ ని ఇవ్వగలిగై.

అ చౌప్లె ఒఫ్ యేర్స్ అగొ, నెను అనుకునె వదిని, థొక్కలొ తెలుగు చినెమ ఎంతి తీసెది, హొల్ల్య్వూద్ హిఘ్ గ్రదె చినెమ తీదం అని. అందుకె షెఖర్ కమ్ముల అమెరిచ లొ చదివి తెలుగు చినెమ తీస్థెయ్ నాకు సెన్సె అనిపియలె. బుత్ ఈరొజు, బల సుబ్రహ్మనీం పదుథ తీయగ చూస్తున్నప్పుదు, ఆయన మతలు వింతు, వెతురి పాత వింతు, మనసులొ ఒక తెలియని బరువు, అ సెన్సె ఒఫ్ హేవినెస్స్. రెసొనంచె? యె దెషం లొ, యె భాష లొ యె మహ కవి రయగలుగుతదంది వెతురి రాసినత్తు. ఈవె క్నౌన్ థిస్ అల్ల్ అలొంగ్. అర్థం చెస్కొదనికి తిమె పత్తింది. అసలెంతి లినె,

యెదమ చతన షివుని విల్లును ఎథిన ఆ రముదెయ్
యెత్త గలద సీథ జదను, థలి కత్తె వెలలొ

అల కొసెసి నత్తు లెదు. అంద్ ఫొర్ థత్, థంక్ యౌ కమ్ముల. ఫొర్ రెమిందింగ్ మె, అ లొత్ ఒఫ్ పెఒప్లె లికె మె, తొ గెత్ బచ్క్ తొ ఔర్ రూత్స్.
ద్య్లన్ నచక కదు, థను వెతురి లా మనసు నింపదు కబత్తి.
చొబైన్ నచక కదు, థను బలు లాగ కదుపు నింపలెదు కబత్తి.

అమ్మ కదుపు చల్లగ లొ ఉన్న మధురత్వం ఇంకెయ్ పదల్లొ ఉంతయ్య చెప్పు?
ఒన్ అ బిగ్గెర్ సిజె, కమ్ముల ఇంత్రొదుచెద్ ఉస్ తొ అరుద్ర, స్రిస్రి, అథ్రెయ, ఇందిరెచ్త్ గానె. నెనెదొ గొప్ప గొప్ప కవిథలు చదివెసను, వెయి పదగలు అవ్వగొత్తని అని చెప్పత్లెయ్. కాని ఇప్పుదు తెలుగు ని చూస్థెయ్ కల్లకి హయిగ ఉంతుంది. తెలుగు పాత వింతె దెవుదికి దెగ్గరగ అనిపిస్తుంది.
తెలుగు కథ వింతెయ్ యెదుపొస్తుంది.

ఆ ఒకతొ తరగథి తెలుగు పుస్తకం ఇంక కల్ల ముందు తిరుగుతుంది. నా 10థ్ చ్లస్స్ తెక్ష్త్బూక్ లొ కథలు గుర్థొస్తున్నై. నా అర్రొగంచె తగ్గుతొంది, ఇగ్నొరంచె ని అచ్చెప్త్ చెస్తున్న, చిన్న చిన్న విషయల్ని ఆస్వదిస్తున్న.

ఇన్నల్లు, జీవిథం అంతెయ్ ఎదొ గొప్పగ సధించెయదం అనుకున్న.
కాని ఇప్పుదె తెలుస్తొంది, పెద్ద చిన్న అని ఎవి ఉందవు. నువ్వు జీవిథంలొ ప్రథి క్షనం ఏం చెద్దం అని దెచిదె చెస్తవొ, ఎవైథెయ్ చెస్తవొ, అవి నిన్ను గొప్పొదిని చెస్తై.

--

telugu. enni rojulaindo telugulo raasi. by the way, ippudu nenu raase danilo, konni chinna chinna spelling mistakes undochu endukante nenu vadedi translator kabatti.
rofl! okappudu english raaka telugu matlade vadini, express cheyadaaniki telugu padaalu use chese vadni kaani ippudu, i don't know adi choice aa leka pothey kavalani cheukunna alavato gaani, ekkuva shaatham aalochinchadam kuda english lo ney avutondi. and this friggin editor sucks. hang on.

anyway, i can't seem to find no better editor, baa, ee okasariki adjust aipondi, next time ninchi spelling mistakes leni clean telugu chaduvuduru gaani

nuvvena, naa nuvvena
nuvvenaa, naaku nuvvena
suryudalle, soodhi guche..

enduku devuda veturini teesukellipoyav. janalu correct ey antaru, untey value teliyadani. aayana unnanni rojulu, eppudu gurthu cheskoledu. poyaka, ye paata vinna aayane madilo. btw, ee post ey daani gurinchey. valla gurinchi evaraithey naalo, nenu telugu vaadnini ani gurthuchesaro. i'm not saying anduke ee revolution antha. naa gurinchi naaku telusu. external forces nannu koncham dooram varake nannu push cheyyagalavu; probably evarinaina. kaani oka point lo nene realize ayya, entha verevi entha pichaina, nenu manaspoorthiga padukune mundu naaku telugu pata, telugu katha leka telugu cinema ne aa completeness ni ivvagaligai.

a couple of years ago, nenu anukune vadini, thokkalo telugu cinema enti teesedi, hollywood high grade cinema teedam ani. anduke shekhar kammula america lo chadivi telugu cinema teesthey naaku sense anipiyale. but eeroju, bala subrahmaniam padutha teeyaga choostunnappudu, aayana matalu vintu, veturi paata vintu, manasulo oka teliyani baruvu, a sense of heaviness. resonance? ye desham lo, ye bhaasha lo ye maha kavi rayagalugutadandi veturi raasinattu. i've known this all along. artham cheskodaniki time pattindi. asalenti line,

yedama chatana shivuni villunu ethina aa ramudey
yetta galada seetha jadanu, thali katte velalo

ala kosesi nattu ledu. and for that, thank you kammula. for reminding me, a lot of people like me, to get back to our roots.
dylan nachaka kadu, thanu veturi laa manasu nimpadu kabatti.
atif aslam nachaka kadu, thanu balu laaga kadupu nimpaledu kabatti.

amma kadupu challaga lo unna madhuratwam inkey padallo untayya cheppu?
on a bigger size, kammula introduced us to arudra, srisri, athreya, indirect gaane. nenedo goppa goppa kavithalu chadivesanu, veyi padagalu avvagottani ani cheppatley. kaani ippudu telugu ni choosthey kallaki hayiga untundi. telugu paata vinte devudiki deggaraga anipistundi.
telugu katha vintey yedupostundi.

aa okato taragathi telugu pustakam inka kalla mundu tirugutundi. naa 10th class textbook lo kathalu gurthostunnai. naa arrogance taggutondi, ignorance ni accept chestunna, chinna chinna vishayalni aaswadistunna.

innallu, jeevitham antey edo goppaga sadhincheyadam anukunna.
kaani ippude telustondi, pedda chinna ani evi undavu. nuvvu jeevithamlo prathi kshanam eam cheddam ani decide chestavo, evaithey chestavo, avi ninnu goppodini chestai.