Thursday, July 14, 2022

మై బియర్

"He wants something better than he has. I want precisely what he has already.", అంటాడు ఎండ్ ఆఫ్ ద టూర్ లో డేవిడ్ లిప్స్కీ డేవిడ్ ఫాస్టర్ వాలెస్ ని ఉద్దేశిస్తు. మొన్న మెహెరన్నతో వాట్సాప్ చేస్తూ అకస్మాత్తుగా ఒక చిన్న రాంట్ వర్షం కురిపించాను. వన్ లైన్ సారాంశం - మీరు ఇంత అద్భుతమైన కళని ఎలా సృష్టిస్తారు, మీ మెథడ్ ఏంటి, మీ డీమన్స్ ఏవి మీరు వాటిని ఎలా జయిస్తారు. కానీ అంతర్లీనంగా అడగదలుచుకున్నది - నాకూ మీలా రాయలనుంది, భాషలో ఆలోచనలలో మీ స్థాయి చేరుకోవాలనుంది అండ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు పొందుతున్న లవ్ అండ్ అడ్మిరేషన్ నాకూ పొందాలనుంది, దారి చూపించు సామీ.

పాపం ఆయన ఓపిగ్గ సమాధానమిచ్చారు, ఆయనన్నట్టు ఇవే ప్రశ్నలు నేను 2-3 ఏళ్ళ క్రితం ఒకసారి వేసాను. 'ముక్కు' లో ఒక పాసేజ్ ని ఎక్సాంపుల్ గ తీసుకొని ఆయన ఇచ్చిన సమాధానంలో రెండు థ్రెడ్స్ కనబడ్డాయి నాకు -  నువ్వు చెప్పే విశేషంలో/వస్తువులో/విధానంలో కొంతైనా యునీక్నెస్ ఉంటుంది, అది చెరిష్ చేయటం నేర్చుకో; కళని యుటిలిటీ లెన్స్ తో చూడకు, అది చిక్కదు అని. మోటామోటాగ నాకది తెలుసు, ఐ అండర్స్టాండ్ దెట్ ఇంటలెక్చువల్లీ కానీ మనసుకి ఊరట కలగలేదే. నీ గుడికొచ్చి వరాలు కోరాను, ఇది కావాలి అది కావాలి అని, అవి నెరవేర్చు కోటానికి కావాల్సిన శక్తి నువ్విస్తానన్నా నాకొద్దు. అడిగిందియ్యి చాలు. చికాగ్గ అనిపించింది. తెలుసు నాకు, టీచ్ ఎ మాన్ టు ఫిష్ ప్రావర్బ్, తెలుసు నాకు ఆయన చెప్పిన దాంట్లో నిజం లేక పోలేదని, తెలుసు నాకు కష్టం లేకుండ ప్రతిఫలం కోరుతున్నానని, ఎక్కడో లోపల చిన్న గొంతు చెప్తూనే ఉంది - నీకావ్వాలసింది నువ్ ప్రోజెక్ట్ చేస్తున్నట్టు పాత్వే టు హిరోయిక్ మార్టర్డం కాదు అడ్మిరేషన్ అండ్ ప్లెషర్ అని. కావాల్సింది అలాంటిలాంటి ఆదరణ గౌరవం కాదు, మెహరన్న పట్ల నాకున్న ఆదరణ గౌరవం. ఆయనకి దాస్తోయెవ్స్కీ తోప్ ఏమో కానీ నాకు ఆయనే తోప్. కానీ ఆ ఆడ్మిరేషన్ కూడా ఎప్పుడూ ప్యూర్ కాదు, ఎందుకంటే ఇట్స టెయింటెడ్ బై జెలసీ, లాంగింగ్, ఎ స్ట్రేంజ్ మిక్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఎన్వీ. నీల టీచరు, ముక్కు, ఒరాంగుటాన్, డిగ్రీ ఫ్రెండ్స్, చేదుపూలు చదివినప్పుడు ఏవో నాకే తెలీని నా అనుభవాల్ని ఆయన దొంగలించి రాసేసి పేరు కొట్టెసాడు అనే ఫీలింగ్. ముక్కైతే మళ్ళీ తీసి చదవాలంటే భయం - "ఇదొక అందమైన జ్ఞాపకంగా మిగిలి పోతుందని అది జరుగుతున్నప్పుడే అనిపించింది", "గుళ్ళో పూజారి, ఎదురుగా అర్చన పళ్ళెం దాంట్లో కొన్ని పూలు లాంటి కనబడని దృశ్యాలు మదిలో కదిలాయి" లాంటి వాక్యాలు ఎదురు పడితే కచ్చ వస్తుంది. అయినా నేను పారాఫ్రేస్ చేస్తున్నా కాబట్టి ఇంత చెప్పగా ఉన్నాయి ఈ వాక్యాలు కానీ ఒరిజినల్ చదివితే ఒళ్ళు జలదరిస్తుంది.

అయితే నా అదృష్టానికి ఆ మెసేజ్ రెండో సారి చదువుతూంటే ఒక విషయం తట్టింది. మెహెరన్న చెప్పిన ఫ్రీడం, ప్లెషర్, డిసైర్ టు ఎక్స్ప్రెస్ నాకు తెలియని అనుభూతులు కావు. బ్లాగ్ చేస్తున్నప్పుడు అలానే ఫీల్ అయ్యేవాణ్ణి. ఇమాజినరీ ఆడియన్స్ లేరు, డిసైర్ ఫర్ ఆకొలేడ్స్ లేవు, పనికొస్తుందా? ఎవరికోసం? లాంటి సందేహాలు లేవు. యే లిఖ్నే కా మన్ కర్రా మేర్కు, ఆకె పడెసో తుమ్హారీ మర్జీ నై తో ఖుదాఫిస్ అన్నట్టె ఉంటుండె. నాకు ఆయన రీచ్ అయిన ఎండ్స్ రీచ్ అయ్యేదుంది కాబట్టి ఆ మీన్స్ ఎమ్యులేట్ చేసేదుంది. కానీ అది చేసినంత మాత్రాన ఆ ఆర్ట్ క్రియేట్ చేయలేను కదా. ఆస్ బెనాల్, క్లీషేడ్ ఆస్ ఇట్ సౌండ్స్, ఐ హావ్ టు సింగ్ మై ట్రూత్. అంతకు మించి చేయగల్గింది ఏం లేదు. క్షణికమైన పబ్లిక్ ఆకొలేడ్స్ బెటరా, లేక క్షణికమైన ఖుల్కే ఖుద్కే లియే రాస్కునే సుకూన్ బెటరా అన్నది ప్రశ్న. ఇది చేస్తే పక్కాగా మొదటిది దక్కుతుంది అన్న గారెంటీ ఉంటే అదే చేస్తనేమో. కానీ అట్ల కాకపోవచ్చు, అయినా సెలౌట్/ ఫ్రాడ్ ఫీలింగ్ అపుడ్ గిన కల్గితే ఇగ బిస్కెట్. దానికన్న గిదే నయంతీ. అసూయ ఉంటది కానీ 'అథెంటిసిటీ' ఉన్నదన్న ఊరట భీ ఉంటది.

హరూకీ మురకామీ ఒక అనెక్డోట్ దొహ్రాయించి తన రాత గురించంటడు, "I’m sorry, but all I have is dark beer." అప్పుడప్పుడ్ అది కాపౌట్ అన్పిస్తది, అప్పుడప్పుడ్ నిజమే కదా, ఒక రచయిత వాడికొచ్చిన దానికన్న ఇంకేం ఆఫర్ చెయగల్తడు అన్పిస్తది. జిందగీల చాలా ఎపిఫనీస్ చూశ్న, గిదీ అంతే. అదొక షార్ట్-లివ్డ్ సుకూన్, మాస్చర్బేటరీ ఆర్గాసం లెక్క. అంతకి మించింది కావాలి, శాశ్వతంగా కావాలి. మొన్న వై బుద్ధిసం ఇస్ ట్రూ గురించి పాడ్కాస్ట్ ల వింటునప్పుడు అతనంటడు, మన బయలాజికల్ మెదళ్ళు ఇవాల్వ్ అయింది మనశ్శాంతి పొందనీకె కాదు, నెక్స్ట్ ఫుడ్, సెక్స్, స్టేటస్ చేస్ చేయనీకె అని. ఐ హియర్ యూ బ్రో అనుకున్న.

కొన్నేళ్ళ క్రితం వశిష్ఠ తన బ్లాగ్ ల నా పోస్ట్నొకదాన్ని ప్రస్తావిస్తూ అన్నడు నేను రాసిన పదాలు తను ఫీల్ అయ్యే విషయాలకి రూపానిచ్చినయని. అప్పుడు కాలౌట్ అయినందుకు జర ఎంబారసింగా అనిపించినా, ఇపుడు దాన్ని ఆబ్జెక్టివ్ గా చూస్తే కాస్త లోతుగ అర్థమైతాంది. నేను మెహెరన్న లా రాయలేను, వెస్ ఆండర్సన్ లా సినిమా తీయలేను - కాల్తది పర్ క్యా కరూ. జర ఉపశమనం ఇచ్చే ఆలోచనేందంటె మెహెరన్నకి, వెస్ కి కూడా ఏ దాస్తోయెవ్స్కీ నో, సాలింజర్ నో చూస్తే గట్లే అన్పిస్తదేమో. బికస్ వైల్ వాట్ దే క్రియేట్ మే ఫీల్ లైక్ మై థాట్స్ అండ్ ఫీలింగ్స్, దే ఆర్ ఆక్చువల్లీ దైర్స్. అండ్ నా బుర్రల అవి పర్ఫెక్ట్ కాబట్టి నేను చేసేదెది డెఫినెట్ గ ఆ స్థాయికి చేరుకోదు. నావి అనెందుకు అనిపిస్తున్నయంటే అవి ఒక షేర్డ్ హ్యుమన్ ఎక్స్పీరియన్స్ నే టాప్ చేస్తున్నాయి. రాగం లీలగా తెలిసిందే అయినా పాట వాళ్ళది. వాళ్ళ పాట మస్త్ నచ్చింది కాబట్టి షేక్ హాండ్ ఇస్త, గలె మిలాయిస్త, రోడ్ మీద నడుస్తున్నప్పుడు హం చేస్కుంట పోత. కానీ గదే పాట నేను రాయాలె, పాడాలె అంటె కుదరదేమో. మేరె ధున్ మె మెర్కొయీచ్ ఎక్ ఎక్ లఫ్జ్ జోడ్ కె, ధున్ సంభాల్తే హుయె గానా బనాన పడ్త. అబ్ ఖుద్ కా గానా కమ్సెకం ఖుద్ కో తు అచ్చ లగ్న నై. ఔర్ జిత్త భీ దునియా భర్ కే గానె సున్లో, ఉన్కో కిత్తా రట్ట మార్నా హై తో మార్లో, ఖుద్ కే గానే కా సుకూన్ తో అలగ్ హీ హై.    

No comments: