Monday, October 4, 2021

నాదీ భారతీయ సంస్కృతే

 My thoughts and counter-arguments to these set of Garikapati Narasimha Rao's video clips. For context, please watch the clips before reading.

 --

1. "..పంజాబీ వరకు పర్లేదండి.. అది భారతీయ సంస్కృతి.. పైగా నన్నడిగితే దాంట్లో కవరేజ్ ఎక్కువ.."
ఎవరు చెప్పేది భారతీయ సంస్కృతి? దేశంలో ఎన్నో కోట్లమంది ఆడవాళ్ళు చీర, పరికిణీ, పంజాబీ సూటు వేసుకోరు. వాళ్ళంతా భారతీయులు కానట్టా? ఒక ట్రెడిషన్ ఫాలో ఐతే భారతీయులౌతారా, లేక భారతీయులు చేసేది కొన్నాళ్ళకు ట్రెడిషన్ అవుతుందా? కట్టు, బొట్టు, ఆహార వ్యవహారాలు మొ|| సమాజంలో ఏర్పడటానికి, ఒక వ్యక్తి అలవర్చుకోటానికి ఎన్నో కారణాలుంటాయి. మరి అలాంటప్పుడు ఒక గిరిగీసి ఇది భారతీయత, ఇది కాదు అని చెప్పటం ఎలా సాధ్యమౌతుంది? మీరు చెప్పే పంజాబీ సూటు మరి ఇండియాలో పుట్టలేదే. అది మిడిల్-ఈస్ట్ నుండి వచ్చి ఇవాల్వ్ అయింది. అసలా మాటాకొస్తే 1940ల దాకా కేరళలో అప్పర్-కాస్ట్ ఆడవాళ్ళు బ్లౌజులు వేసుకోక పోయేవాళ్ళు. మరి వాళ్ళది కాదా భారతీయ సంస్కృతి? అయినా జీన్సు పాంట్లు వేసుకునే వాళ్ళకే/ వాళ్ళవల్లే రేపులు జరుగుతాయంటే, ప్రతి వెస్టర్న్ కంట్రీలో 24 గంటలు రేపులే జరగాలే? ఎందుకంటే అక్కడి ఆడవాళ్ళు అవే వేసుకుంటారు కనుక.

2. "..అమ్మాయిలకి చెబుతున్నా తండ్రి స్థానంలో చెప్పాలి కాబట్టి.."
వద్దు సార్, మీరు తండ్రి స్థానంలో కూర్చొని చెప్పకండి. మన గొడవంతా ఆడవాళ్ళని తల్లులుగానో, బిడ్డలగానో, చెల్లెళ్ళగానో ఒక straitjacketలో ఉంచటం. అప్పుడు వాళ్ళకి మనుషులుగా ఏజెన్సీ, లిబర్టీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా. సాటి మనిషిగా గుర్తించి మంచి చెడు మాట్లాడండి, చర్చించండి, తెలుసుకోండి. లేదు మీకు చెప్పే స్థానంలో కూర్చోవటమే ఇష్టమంటే అబ్బాయిలకి చెప్పండి, "మీరు పద్ధతిగా ఉండండి, అమ్మాయిలని గౌరవించండి, అవతలి మనిషిని objectify చేయకండి", అని చెప్పండి.

3. "..అందమైన అవయవాలు పొందిగ్గా కనబడుతూంటే కుర్రాడెవడైనా ఊరుకోగలడా అండి"
మీరు ఆ స్థానం లో కూర్చొని ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అర్థం అయ్యే పరిభాష వాడే ప్రయత్నం చేస్తాను: మీరు కొత్త కారు కొనుక్కొని ముందుగా పూజ చేయించటానికి గుడికెళ్ళారు. అక్కడ కారుని గుడి బైట పెట్టి అర్చన టికెట్టు కొనుక్కోటనికి లోపలికెళ్ళారు. అసలే చిన్న రోడ్డు, మీ పెద్ద కారు సందుని బ్లాక్ చేస్తోంది. ఆ రద్దీలో ఓ కుర్రాడు బైకు మీద అజాగ్రత్తగా వెళుతూ మీ కారుని వెనక నుండి గుద్దేసాడు. పరిగెత్తుకుంటూ బైటికిచ్చొన మీరు వాడిని పట్టుకొని వాయించేస్తారా లేక అయ్యో అసలు నేను కారు కొనటం వల్లనే కదా ఇంత ఉపద్రవం వచ్చింది, తప్పు నాదే అని సరిపెట్టుకుంటారా?

4. "..అది వాడి హక్కు.."
నాకు నచ్చినట్టు నేను ఉండటం నా హక్కు. వాడికి నచ్చినట్టు వాడు ఉండటం వాడి హక్కు. అంతే కాని నేను నా పాటికి రోడ్డుమీద వెళుతూ ఉంటే హరాస్ చేయటం, సెక్ష్వల్ అబ్యూస్ చేయటం వాడి హక్కు కాదు. నేను ఒకలా ఉంటే వాడు వాడి ఊహల్ని తీసుకెళ్ళి బాత్రూంలో ఏం చేసుకుంటాడు అనేది వాడి హక్కు. కానీ సమాజంలో నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు వాడికి లేదు. కానీ వాడు హక్కులా ఎందుకు ఫీల్ అవుతాడు అంటే అది మీలాంటి వాళ్ళ వల్లే. అమ్మాయి ఒకలా ఉండాలి, అబ్బాయి ఎలా అయిన ఉండొచ్చు అని తీర్మానించి ఇలా టీ.వీల్లో చెప్పే మీలాంటి వాళ్ళవల్లే.

5. "..ఖాళీలు కనబడేలా.. ఇల్లాళ్ళండి వీళ్ళ దుంపతెగ.."
మరి అవే రూల్స్ మొగవాళ్ళకి అప్లై కావా? మీ ఏజ్ అంకుల్స్ అంతా రోడ్ల మీద మడిచిన లుంగీలు, కట్ బనీన్లతో తిరగరా? అయినా ఇల్లాళ్ళు సరిగ్గా లెరనే అనుకుందాం.. మీకూ పెళ్ళైంది కదా, మరి మీరెందుకు ఆ దృష్టి తో చూస్తున్నారు  వేరే ఆడవాళ్ళని?

6. "..ఎవరికీ ప్రదర్శనలు?"
నిజం ఒప్పుకోవాలంటే నేను ఇదే ఆలోచించే వాడిని, ఎందుకు చేయటం ఎక్స్పోసింగ్ అని. అయితే రెండు విషయాలు 1. ఎవడు నిర్దేశిస్తాడు ఏది ఎక్స్పోసింగ్ అని? తాలిబాన్ లకు బుర్కా కాకుండా ఇంకేదైనా ఎక్స్పోసింగే? రాజస్థాన్ లో పైకొంగు లేకపోతే అది ఎక్స్పోసింగ్. ఎవరు నిర్దేశించాలి? అదలా ఉంచితే మొగవాళ్ళ ఎక్స్పోసింగ్ కూడా ఆపమని మీరు చెప్తారా? 2. పోనీ ఒక అమ్మాయికి ఎక్స్పోసింగ్ చేయలనే కోరికే ఉందనుకో. అయితే ఏమైన చేయొచ్చా? ఇంకో ఉపమానం: మీరు రేపు రోడ్డు మీద పోతున్నారు, ఎవరో వెనక నుండి వచ్చి నెత్తి మీద ఠపీమని కొట్టాడు. ఎందుకురా కొట్టావ్ అని ఆడిగితే నువ్వు హెల్మెట్ పెట్టుకోని తిరగవోయ్ అని సమాధానమిస్తే ఊరుకుంటారా?

7. "..వాడు కుర్రాడు.. శ్రీరామ చంద్రుడిలా ఆలోచించాలంటే వాడి వల్ల అవుతుందా?"
ఓ, మరి ఆడపిల్లకెందుకు చెబుతున్నారు సీతమ్మలా ఉండాలని, అనసూయలా ఉండాలని? ఎందుకు సంస్కృతి, కుటుంబ కుల గౌరవాలు, ఆఖరికి తన ఫిసికల్ సేఫ్టీ బరువు బాధ్యతలు పూర్తిగా ఆడవాళ్ళ మీద వేస్తారు? మొగవాళ్ళకేమో కాస్త మనిషిలా ప్రవర్తించండిరా అని కూడా చెప్పలేనప్పుడు?

8. "..సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మన పద్ధతి మనము మార్చుకోవద్దా.."
మీకు మీరు అన్వయించుకోలేరా ఈ స్టేట్మెంట్ ని? మీరు మారండి బయట సమాజం ఇలానే ఉందని. ఎందుకంత తాపత్రయం మరి "భారతీయ సంస్కృతిని" కాపాడేయాలని? అయినా సమాజం మారాలని పోరాడకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా, ఈ మాత్రం అన్నా power imbalance తగ్గేదా?

9. "..మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి.."
An insiduous capture of important terms. కొన్నేళ్ళ కింద ప్రభుత్వం ఎవడు national/anti-national అని తీర్మానించినట్టు, మీరెవరు సార్ "భారతీయ సంస్కృతి" మీద copyright పుచ్చుకోటానికి? అంటే మీ guidelines follow కాని ప్రతి అమ్మాయి భారతీయురాలు అని చెప్పుకోడానికి అర్హురాలు కాదా? నేను మీ భగవద్గీతలు, పురాణాలు ఏవీ చదవలేదు. మన రాజ్యాంగం కొంత వరకు చదివాను. కాని నన్ను నేను భారతీయుడిగానే పరిగణించుకుంటాను, బయట పరిచయం చేసుకుంటాను. నేను ఈ పోస్ట్ రాయటంలో భారతీయ సంస్కృతి తోనే సంభాషిస్తున్నాను. మంచి అనిపించేది నలుగురితో పంచుకొని సెలబ్రేట్ చేస్తున్నాను, చెడు అనిపించింది అర్థం చేసుకొని మార్చే ప్రయత్నం చేస్తున్నాను. సంస్కృతి అంటే ఎప్పుడో ఎవరో చెప్పిందే కాదు కదా? దానిని మన బుద్ధితో, సమాజ అవసరాల మేరకు అన్వయించుకోగలిగినప్పుడే కదా సంస్కృతి regenerate అవుతూ evergreen గా ఉంటుంది. దేశభక్తి, సంస్కృతి పై ఇష్టం, గౌరవం మీకే కాదు మాకూ ఉన్నాయి.

10. "..శృంగారానికి అశ్లీలానికి మధ్య గీతుండాలి.."
మంచికి చెడుకి మధ్య గీత మీరన్నంత క్లియర్ గా ఉంటే ఇంక ఇంత ఆరాటం ఎందుకు. ప్రొఫ్ ప్రతాప్ మెహ్తా ఒక భలే మాట చెప్పారు- "మంచికి చెడుకి తేడా అంత ఈజీ అయితే ఒక రూల్ బుక్ ఉంటే సరిపోతుంది. కోర్ట్లెందుకు, ఆలొచించి తీర్మానించే జడ్జులెందుకు? Principles మనకి ఎంత వరకు పనికొస్తాయంటే అవి మనల్ని వివిధ కోణాల నుండి ఆలోచింప చేస్తాయి. ఆ పైన అన్నింటి కన్నా ముఖ్యమైంది మన జడ్జ్మెంట్". దానికి కావాల్సినది మీరెక్కడో కూర్చోని మంచి/చెడు మధ్య ఒక absolute గీత గీయటం కాదు. ఆ గీతని సమయానుసారంగా గీయగలిగే విచక్షణ ఎలా అలవర్చుకోవాలో ఆ thinking tools ఇచ్చే ప్రయత్నం చేయటం.

11. "..శెనగల్లా వధూమని తన కోరికలని దాచుకోవాలి.."
జీవితమంతా ఆడవాళ్ళ desiresని, agencyని police చేయటమేనా పని? మొగవాడే వాడి కామాన్ని, ఉద్రేకాన్ని జాగ్రత్తగా పొందు పరుచుకోవచ్చు కదా? ఒకసారి ఆలోచించండి.

12. "..చీర కట్టుకొని పద్ధతిగా ఉన్న అమ్మాయిలని వాళ్ళేం అనరు.."
ఆరేళ్ళ పిల్లలు, అరవైయ్యేళ్ళ పెద్దలు ఏం చేసారు మరి అని అడగాల్సి రావటమే ఎంతో బాధాకరంగా ఉంది.

13. "..టీ-షర్ట్ల మీద నినాదాలు చూసి.."
పాపం instructions follow అవుతున్నారా? 'ఆడవాళ్ళకు మాత్రమే' అని సీట్ల మీద రైల్ కంపార్ట్లమెంట్ల మీద ఉంటే మాత్రం అవెందుకు అనుసరించట్లేదో? ఏం సార్ ముందో కెమెరా, మైకుందని ఏది పడితే అది మాట్లాడితే ఎలా?

14. "..వేషాలు మారితే తప్ప అత్యాచారాలు మానవు.."
మరి మీరు చెప్పేదే నిజమైతే, 60-70% రేపులు ఇంట్లోవాడో తెలిసిన వాడో చేస్తాడట. దానికేంటి సమాధానం? స్త్రీవాదుల మీద విరుచుకుపడ్డారే, ఒక్క స్త్రీవాద పుస్తకమైనా చదివారా? వాళ్ళ కథలు విన్నారా? రేప్ కల్చర్ మీద, వుమెన్ హెరస్మెంట్ మీద ఎంతో మంది చేసిన రీసర్చులు చదివారా అసలు sexual harassment మీద మాట్లాడటానికి?

15. "..అత్తగారి వల్ల..డబ్బున్న కుర్రాళ్ళు.."
Random. ఏదన్నా statistical backing ఉందా ఈ claimsకి?

16. "..ధర్మం కోసం సంఘమేది?..ఏది ధర్మమో దాని కోసం పోరాడతాం.."
అదే కదండీ గొడవంతా. మీరు ఇది ధర్మం అంటారు, ఇంకో మతపోడో కులపోడో వచ్చి ఇంకేదో ధర్మం అంటాడు. అందుకే కదా liberal democracyలో individual rightsకి పెద్దపీట వేస్తూ రాజ్యాంగం రాసుకున్నది. నీకు నచ్చినట్టు నువ్వుండు ఆ హక్కు నీకుంది. కానీ ఇంకో మనిషికీ అదే హక్కుంది. అవును సొసైటీలో అంత తేలిక కాదు అంత individually delineatedగా బ్రతకటం. అందుకే కల్చర్, ఎడ్యుకేషన్ వగైరాలు. దానిలో భాగంగానే ఏదో మంచి విషయం తెలుసుకోవాలని ప్రజలు మీలాంటి వాళ్ళ ప్రోగ్రాములు చూసేది. మరి దానికి తగ్గ మాటలే మీరు మాట్లాడుతున్నారా?

ప్రజల మీదా బాధ్యతుంది ఎవరో పండితుడట చెప్పాడు కదాని ఊరేగటం కాకుండా, మన ఆలోచనల్ని, అనుభవాల్ని, విచక్షణని, వివేకాన్ని ఉపయోగించి మంచి చెడు నలుగురితో చర్చించటం. ఆ చర్చలో పాల్గొనాలనే కోరికే ఈ పోస్ట్ కి ప్రేరణ. ఎవరికీ monopoly లేదు సంస్కృతి మీద. మనమంతా ఎలా బ్రతికితే మంచిగా కలిసి బ్రతుకుతాము అనేదే గా మంచి సంస్కృతి. మరి మనుషులు మారుతున్నప్పుడు, ప్రపంచపు స్థితిగతులు మారుతున్నప్పుడు, ఎలా బ్రతకాలి ఎలా మారాలి అనే విషయాలు ever-evolving. అది నిత్య చర్చలో భాగం, నిత్య చర్యలో భాగం. It is the human project. It is on us to remember that we cannot outsource it to anyone- అది PM అయినా సరే, ధార్మిక గురువైనా సరే, కుల పెద్ద అయినా సరే.. ఇంకెవరైనా సరే.

9 comments:

Unknown said...

Super!!

Unknown said...

Yes i agree totally with u sir

Hemalatha suri said...

Super ADB. Very proud of u. So much of insight into gender differences. Well done.

Shyamala said...

Excellent....totally agree

maa godavari said...

భూమిక పత్రిక లో ప్రచురించవచ్చా. అంగీకరిస్తే bhumikahyd@gmail.com మెయిల్ చెయ్యండి

padmasri said...

బాగా అడిగారు. ఆ ప్రవచనకారుల ప్రతి ప్రసంగాన్ని చీల్చి చెండాడాలి.

Nyayapathy venkata Srinivas said...

Relevant rebuttal. Exposed the naked hypocricy of the so called self- styled,egoistic revivalist.

kiran said...

so true!

Lalitha vani said...

Super counters really great work Aditya good keep going