Thursday, January 2, 2020

కవి, అంతే

అర్థరాత్రి, శ్రీశైలం అడవుల్లోంచి పాకుతున్న రోడ్డు. సప్తమి చంద్రుడు, మెల్లిగా వీస్తున్న గాలి. ఖాళీ రోడ్డు మీద నెమ్మదిగా వెళుతున్న ఒక లారీ.  నిద్రతో తూలుతున్న క్లీనర్ కుర్రాడు, గదమాయిస్తున్న డ్రైవర్.

లారీ వెనకాల భాగంలో, గడ్డివాము మీద వెల్లకిలా పడుకొని గుబారైన కొమ్మల సందుల్లోంచి వెన్నెలని చూస్తూ,  సిగరెట్టు కాల్చుకుంటున్న ఇరవై-ఇరవై రెండేళ్ళ కుర్రాడు.

లారీ ఆగింది, చిన్నగా మాటలు వినబడుతున్నాయి. ఒక మనిషి అడుగులు దగ్గరవుతున్న శబ్దం. ఇంతలో ఒక టోపీ తల ప్రత్యక్షమైంది.

"దిగు దిగు.."

కుర్రాడు దిగాడు. ముడతల లాల్చీ, చింపిరి గెడ్డం, ఎర్రటి కళ్ళు. ఎస్.ఐ దెగ్గరికి వెళ్ళాడు. చెరగని క్రాఫు, గుబురు మీసం.

"ఏరా నక్సలైట్ వా?"
"కాదు సార్"
"మరి?"
"కవిని సార్"
"కవివా? ఏది ఓ కవిత చదువు"
".."
"ఏంటి? కవివైతే ఓ కవిత చెప్పరా"

ఎస్.ఐ, ఇద్దరు కాన్స్టెబుల్లూ, డ్రైవరూ, క్లీనరూ అందరూ తననే చూస్తున్నారు. పై పెదవి మీద చమట తుడిచాడు.

ఓ కవిత చదివాడు. తను రాసినది. మట్టి వాసన గురించి, రైతు చేసే సేద్యంలో కళ గురించి, తొలకరి ఝల్లు గురించి, పసిపిల్లల నవ్వుల గురించి. గంగడోలు నిమురుతున్నప్పుడు ఆవు కళ్ళళ్ళో తన్మయత్వం గురించి.

అయిపోయింది. నిశబ్దం.

ఎస్.ఐ ఓ అడుగు ముందుకేసాడు. చొక్కా జేబులోంచి సరిగ్గా మడిచిన పది రూపాయల నోటు తీసి కుర్రాడి లాల్చీ జేబులో పెట్టాడు.

"వెళ్ళండి", అన్నాడు

-Based on an anecdote narrated by Tanikella Bharani garu

--

I wrote this poem for the Creative Writing class I took with the poet Mark Tredinnick. He said this was too descriptive, straightforward to be called a poem.  I think he's right.

when life does us 'part

the sun is dragging back the shadows
and the house is sinking into darkness

the birds have quietened
the tv is not on yet

she lies on the bed, mouth slightly parted
whirling slowly on the soft grass of shallow sleep

a motorbike whooshes past outside
and she is snapped out of the vestiges of hard-earned darkness

she gets up and wipes the saliva off her mouth
rearranges her sari and comprehends the oncoming night

she switches on the tv and for a few seconds
the deathly metallic neon light illuminates her face

the small eyes with their cataract eyeballs,
the sharp nose that had once left young men enthralled
the glittering nosering and the saggy earlobes

the teeth browned with thousands of paans
and the face once full and radiant
now gaunt, wrinkled, the corollary
of a lifetime of suffering and a lost son

she walks from room to room
slicing through the amorphous barrenness
a moribund apparition in a ghost town

she switches on the lights and joins her palms
in a namaste to the pictures of gods in every room
not asking, not praying, not beseeching anymore

once she is done with the last room
she starts switching off the lights
retracing her parikrama, snubbing any memories
from the books and photos, mementos and clothes
before they get a chance to leap onto her

now back in her room, alone infront of the tv,
she is slowly ensconced into her lonely delirium

she and i were best friends once, my grandmother and i
she was my partner, protector, guardian angel, mother earth

then life beckoned and i
flew away from the nest like the rest

i want to go back, but do i really?
to that house and her flickering life
to the past that i know will someday destroy me
like it did to her and everyone else