Thursday, November 9, 2023

artrippin'

కీడా కోలా అనే ఈ తరుణ్ భాస్కర్ అద్వైత ప్రవచనానికి క్వింటిన్ టారెంటినో వేదిక సిద్ధం చేయగా గయ్ రిట్చీ మైకు సౌండూ బాధ్యతలు నిర్వర్తించారు.

కార్ల పోతున్నప్పుడు నాకు శ్రావణికి అయ్యే మోస్ట్ రిపిటిటివ్ వాదన వివేక్ సాగర ఒవర్రేటెడా కాదా అన్నది. నేనంట అసల్ గసుంటి సౌండ్ ఇంకేడన్నా ఇన్నవా అని, తనంటది అదే ప్రాబ్లం అన్ని పాటల్ ఒకటే తీరుంటయని. నాక్ రెఫ్యూట్ చేయనీకె కరెక్ట్ వాదన దొరక్క తంటాలు పడతాంటా. నేన్ సిగ్నేచర్ అంట, తను రిపిటెటివ్ అంటది. మొన్న డిపిరి డిపిరి తనకి ఇనబెడ్తాన్నప్పుడు అంటే సుందరానికి ప్రోమో సాంగ్ లెక్కనే ఉన్నది కదా అన్నది. నాక్ కాలి అది నెక్స్ట్ ప్లే చేశి ఏంది సిమిలారిటీ అని అడిగిన. ఆ ఎక్సర్సైజ్ వల్ల ఇద్దరం చాలా శ్రద్దతో రెండు పాటలు వింటూంటె నాక్ ఒకటి తట్టింది- తన పాటలు ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ మైక్రో-ట్యూన్స్ అని. ఆ జారీనెస్, బార్డర్లైన్ ఇన్‌కోహెరెన్స్, అమాల్గమేషన్ ఆఫ్ వేరీడ్ సౌండ్ స్టైల్స్ అన్నీ కలిపితే అది వివేక్ సాగర్ సౌండ్.

గీ ముచ్చట నిన్న ధీరజ్‌గాన్తో శ్వాస మీద ధ్యాస మీద ట్రిప్ అయితున్నప్పుడు చెప్పిన. అపుడ్ వాడొక మస్త్ మాట చెప్పిండు- వివెక్ సాగర్ మ్యూజిక్ మాన్యుఫాక్చర్ చెస్తడన్నా అన్నడు. అరె కరెక్ట్ పదం పట్టిండ్రభై అనిపించింది. ఆ తర్వాత తనని, రెహ్మాన్‌ని, ఇళయరాజాని కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసే ప్రయత్నం చేశ్నం. మేమిద్దరం మ్యూజిక్‌ల అల్టిమేట్ గవార్లం కాబట్టి మాకు కనిపించి, చేజిక్కే పరికరాల్ని కాన్సెప్ట్స్‌నే వెతుకున్నం. మైనర్ డైగ్రెషన్: స్మరణ్ వివేక్ ఆన్ స్టెరాయిడ్స్ అని చెప్పి కొత్త పోరడు సౌండ్ట్రాక్ ఇనమన్న. మీర్‌భీ ఇన్నుర్రి- కిరాక్ ఫకిన్ గుడ్ ఉంటది. బాక్ టు గవార్ మ్యూజిక్ అనాలిసిస్: ధీరజ్ గాడన్నడు రెహ్మాన్ అచ్చిన కొత్తల పబ్లిక్ అంటుండె గీనె సిన్థసైజర్ గవీ ఎక్కువ వాడ్తడు, రాజా మ్యూజిక్ లోని ఇన్‌స్ట్రుమెంటల్ వెరైటీ ఉండది అని. టెక్నికల్లీ సాఫిస్టికేటెడ్ బట్ విదౌట్ ది రిచ్‌నెస్ ఎండ్ క్రియేటివిటీ ఇన్ మ్యూజిక్ అని (అరేయ్ ధీరజ్ నేన్‌గిన నిన్ను మిస్కోట్ చేస్తాంటే కింద కామెంట్స్‌ల తెలియజెయ్). కానీ మా తరం వాళ్ళకి ఆస్ మచ్ ఆస్ వీ లవ్ రాజా సర్, రెహ్మాన్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. మేబీ ఇట్సె జెనరేషనల్ థింగ్ అనుకున్నం. కానీ ఆ తర్వాత అచ్చిన అమిత్ త్రివేది (అమ్మతోడు డేవ్.డి ఏమన్న సౌండ్ట్రాకా), వివేక్ సాగర్‌లు ఎంత నచ్చినా ఇంకా రెహ్మాన్ స్టేల్ ఆర్ నీష్ అయిపోలేదు. ఎందుకని జర ఆలోచన పెట్టినం.

అపుడ్ మెహెరన్న తట్టిండు. మా స్మాల్ కెపాసిటీస్‌ల నేను ధీరజ్‌గాడు ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ లెక్క. కొత్త టూల్స్ వాడుకుంట మాకు ఉన్న కేపబిలిటిల మేము మా యధార్థాన్ని పట్టునికి, ప్రతిబింబించే ఆర్ట్ (నా రాతలకి అది పెద్ద పదం కానీ ప్రస్తుతానికి అడ్జెస్ట్ కార్రి) క్రియేట్ చేస్తున్నం. ఆ ఫ్రాగ్మెంటేషన్, పీస్-మీల్ అప్రోచ్ అప్పుడప్పుడు వర్కౌట్ అయితది కానీ కన్సిస్టెన్సీ అంత లేదు. మోర్ ఇంపార్టెంట్లో, అది మాబోటొల్లకి నచ్చిద్ది కానీ వైడర్ ఆడియెన్స్, బోత్ ఇన్ టైం అండ్ స్పేస్, దొర్కరు. కానీ మెహెరన్న రచనలు అట్ల కాదు. దే ఆర్ నాట్ జస్ట్ స్టాగరింగ్లీ పర్టినెంట్ బట్ అల్సో పార్ట్ ఆఫ్ ది ట్రిడిషన్. అదెట్ల, ఎందుకు అని ఆలోచిస్తే మాకర్థమైనది ఏందటే ఆయన కానన్ చదివిండు, ఆకళింపు చేస్కున్నడు, మంచి చెడు గ్రహించి ఆ పరంపరని ఎంబ్రేజ్ చేశిండు. మేము అట్లేంలే. ఎంతోకొంత రాయొచ్చు కాబట్టి దిమాఖ్ మే జో ఆయా వో లిఖ్ దేరే. ఇప్పటి ప్రపంచంతో ఎంగేజ్ అయితున్నం కాబట్టి ఇంతో అంతో ఆ వైబ్, జైట్‌గైస్ట్ స్పృహ అందులో మిళితమైనా ఫన్‌డమెంటల్ ప్రిన్సిపల్స్ తెలీవు కాబట్టి అవి నిలవవు అని నా అభిప్రాయం. ధీరజ్ గాడికి అట్లాంటిదేదో సృష్టించాలన్న కాంక్ష ఉందనుకుంట గానీ నాక్ లేదు/ పోయింది. ట్రూత్ ఓవర్ బ్యూటీ అని నేననేదానికి మూల కారణం నాలో బ్యూటీని నిర్వచించి, సృష్టించ గలిగే సామర్థ్యం లేకపోవటం. ఎనీవే, మెహెరన్న రెహ్మాన్ లాగ ఎందుకంటే ఆయన క్రాఫ్ట్ ఈజ్ బిల్ట్ ఆన్ ఎ క్లాసికల్ ఎడ్యుకేషన్ బట్ హిజ్ ప్రీఆక్యుపేషన్స్ ఆర్ కాంటెంపొరరీ.

పెద్ద డిస్క్లైమర్: వివేక్ సాగర్‌ది కంప్యూటర్ మ్యూజిక్ అని మా రాతలతో పోల్చటనికి కారణం పైపైన్ మా సృజన కూడ అలాంటిందే అన్న పోలిక కనిపించడం. అంతే కానీ వివేక్‌కి సంగీత జ్ఞానం లేదన్న ప్రతిపాదన కాదు. అలా అనేంత స్థాయి మాకెలానో లేదు, అహంకారమూ లేదు. అంతేగాక తన సంగీతం పట్ల ఎంతో ఇష్టము, కృతజ్ఞత ఉన్నాయి. గీ ముచ్చటల నన్ ఆఫ్ అవర్ పర్సానిఫికేషన్స్ మేబీ ఆక్యురేట్. గిదంతా మా కల్పనే.

ఈ లొల్లి ఎపుడ్ ఉండనే ఉంటది కానీ మీర్ పొయ్యి కీడా కోల చూడుర్రి. ఇచ్చి పడేశిండు తరుణ్. ఇగ వివేక్ భాయ్ దాన్ని మెగా ఎలివేట్ చేశిండు. నాకైతే స్నాచ్ ఇన్స్పిరేషన్ మస్త్ కొట్టొచినట్టు ఔపడ్డది (రఘురామ్ బాటంస్-అప్, ఫ్లైట్ టేకాఫ్, స్క్రీమ్ క్విక్-కట్ ఈజ్ ఎ క్లియర్ హొమాజ్). ఎడ్గర్ రైట్ ప్రభావం ఉందని సద్విన కానీ నేన్ వాన్ సైన్మాల్ సూడలే కాబట్టి తెల్వది. టారెంటినో ఎలానో ఉంటడు. ఆయన వీళ్ళందరి పెద్దన్న- హీ ఈజ్ ద ఒరిజినల్ భక్త నాయుడు. తరుణ్/ జీవన్/ విష్ణు ట్రాక్ ఈజ్ గోల్డ్; విష్ణు ఓయ్ ఈజ్ అల్వేస్ ఎ థ్రిల్ టు వాచ్.

ఒకప్పుడు దీన్ని పోస్ట్-మాడ్రనని గిదని గదని అర్థం చేస్కొని నేన్ గిసుంటిది ఎట్ల క్రియేట్ చేయలని తంటాలు పడి పరేషాన్ అయితుండె. ఇపుడ్ భీ తెల్సుకోవలన్న జిజ్ఞాస, ఇగో గిట్ల ఒర్లే అలవాటు పోలే కానీ అరే నేన్ ఎందుక్ర భై చేయలేక పోతున్న అన్న ఒళ్ళుమంట, కచ్చ లెవ్వు. కొంత వరకు దానికి కారణం నేనూ ఇంతో అంతో రాసుకోడం/ ఫిల్మ్ చేయడం, నా లిమిటెడ్ కేపబిలిటీస్‌ని అక్సెప్ట్ చేయటమే కాక నచ్చిన ఆర్ట్‌ని ఇష్టంతో, కృతజ్ఞతతో, స్వేచ్ఛతో చెరిష్ చేసే పరిపక్వత రావటం. ఇలా బావుంది, ఆస్ యూష్వల్ ఎన్నాళ్ళుంటదో చూడాలి మరి.

No comments: