Tuesday, March 10, 2020

earthbound

I wanted to expand on the following essay and send it to one of the Telugu webzines. But after writing it, I realized that the thematic thread is not as strong as I thought it was and I was overreaching by the way of advocating that they shared a certain worldview. So I decided not to polish it and send it for publication, and am therefore archiving it here. This is more or less the first draft of the essay I set out to write and I'm only abstaining from publishing the title because I think it's a good one and I might find a more appropriate place for it sometime in the future.

Also, I don't think I mentioned it in the essay but some of the ideas also come from Rick Roderick's illuminating essay Masters of Suspicion.

--

కిందటేడాది నేను నాలుగు మంచి తెలుగు సినిమాలు చూసాను- c/o కంచెరపాలెం, ఫలక్నుమా దాస్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా. వీటి మధ్య నాకొక కామన్ థ్రెడ్ కనిపించింది. నాలుగు సినిమాలూ వేరు జానర్లకు సంబంధించినవి, aesthetics వేరు, టోన్ వెరు. అయినా కూడా నాకొక common ethos కనబడింది. ఇది నా చూపు వల్ల, నా మైండ్సెట్ వల్ల అలా కనబడిందో లేక if 'there’s something in the air' ఓ నాకు తెలిదు. ఆ worldview కొత్తది, గొప్పది ఏం కాదు కానీ ఈ మధ్య వచ్చిన మంచి తెలుగు సినిమలలో తటస్తించటం నాకు చాలా ఆసక్తిని కలిగించింది.

అది ఏంటంటే- ఈ సినిమలు నాలుగింటిలో దైవత్వ ప్రస్తావన అధికంగా ఉంది. సాధారణంగా mainstream తెలుగు సినిమాల్లో మన హీరోలకి god complex ఉంటుంది. వాడు omniscient, omnipresent, omnipotent. వాడికి సంకోచం ఉండదు. వాడు ఏమన్నా చేయగలుగుతాడు. ఎందరినన్నా కొడతాడు, ఎలాంటి అమ్మాయినైనా ఇట్టే పడేస్తాడు, పెద్దా చిన్నా భేదం లేకుండా అందరికీ క్లాసులు పీకేస్తాడు.

మన కథానాయకుడు అవతార పురుషుడు. వాడు వేరే వాళ్ళని ఉద్ధరించటానికే వస్తాడు. వాడు జన్మతహ జ్ఞాని, బలాశాలి, చమత్కారి. సినిమా మొదట్లో ఎలా ఉంటాడో చివర్లోనూ అలానే ఉంటాడు. కానీ వాడి చుట్టు ఉన్న ప్రపంచం మారుతుంది, వాడి చర్యల వల్ల మారుతుంది. విలన్లు నశిస్తారు, చెడ్డ గుణాలున్నవారు పరివర్తన చెందుతారు.

త్రివిక్రం మహేష్ ఖలేజా ఈ కాన్సెప్ట్ మీద ఒక మంచి రిఫ్- ఆ సినిమాలో ఊరి వాళ్ళు హీరోని దేవుడంటారు, వాళ్ళని కాపాడమని వేడుకుంటారు; వాడేమో నేను మామూలు మనిషిని నన్నొదిలేయండి అని పారిపోతూంటాడు. Ofcourse, చివర్లో వాడిలోని దైవత్వాన్ని గుర్తించి ఆబాలగోపాలాన్ని రక్షిస్తాడు. ఈ సినిమాలో ఒక గమనించ దగ్గ విషయం ఏంటంటే వాళ్ళకి కష్టం వస్తే ఊళ్ళోవాళ్ళు ఒక్కటై దానిని ఎదురించరు. జ్యోత్స్యం చెప్పేవాడి మాటలి బట్టి వాళ్ళ redeemer ని వెతికి తెచ్చుకుంటారు.

ఈ ఆలోచనా విధానం మన పురాణాల నుండి, మన mythologies నుండి వచ్చిందంటారు దేవ్ దత్ పట్నాయిక్. రాముడు మారడు, కృష్ణుడు మారడు. ఇది మన collective unconsciousness లో ఎంతగా ఇంకిపోయిందంటే మనం హీరో హీరోయిన్లకు గుళ్ళు కడతాం, పాలాభిషేకాలు చేస్తాం. రాజకీయ నాయకులని సేవికులగా కాకుండా రాజుల్లాగా చూస్తాం.

చిరంజీవి మెగస్టార్ అయిన తరుణం నుండి ఇది మన స్టాండర్డ్ ఫార్ములా. మినహాయింపులు లేకపోలేదు- క్రిష్ జాగర్లమూడి గమ్యం ఒక మంచి ఉదహరణ. దాంట్లో కథానాయకుడు పరివర్తన చెందుతాడు. వాడి మారుపే కథ. కానీ అది ఇమడ్చిన ఫార్ములా సీత కోసం రాముడు చేసిన ప్రయాణం. బుద్ధుడి transformation లా కూడా ఉంటుంది. (అందుకేనా కథలో ఒక మేజర్ పొర్షన్ అమరావతిలో సెట్ చేసాడు?)

అయితే పాప్యులర్ సినిమా ఈ ఫార్ములా మీదనె నడిచింది- మెగాస్టార్ చిరంజీవి నుండి ఇప్పటి సూపర్‌స్టార్ మహేష్ దాక. ఫాన్స్ భక్తులుగా మారారు, హీరోలు వాళ్ళ మిథాలజీస్‌ని వాళ్ళే నమ్మడం మొదలెట్టారు, దీనితో గాడ్ కాంప్లెక్స్ వచ్చింది. హీరొని ఏ పాత్ర ఒక్క మాటనటానికి వీల్లేదు, హీరో కోసం వెంపర్లాడుతుంది హీరోయిన్, వాడికి పెద్ద చిన్న మంచి మర్యాద సొషల్ సైన్స్ దేనితో సంబంధం లేడు. వందల మందిని కొడతాడు, ఆడబడుచులని కాపాడతాడు, రైతులకు న్యాయం చేస్తాడు, ఫారెన్‌లో స్టెప్పులు వేస్తాడు.

ఈ తీరు సినిమా ఇంకా చాలానే ఉంది. అయితే నేను పైన పేర్కొన్న నాలుగ్ సినిమాల్లో వేరే రకమైన worldview కనబడుతోంది. దీంట్లో జొసెఫ్ కాంప్బెల్ వ్యాప్తిలోకి తెచ్చిన hero's journey కనబడుతుండి. ఈ మార్పు ఈ తరం బాలీవుడ్ హీరోల్లో రన్‌బీర్ కపూర్ తో మొదలైంది.

హీరో ఒకలా ఉంటాడు. ఒక సమస్య లోకి నెట్టేయబడ్తాడు. కొందరిని కలుస్తాడు, కొన్ని జీవిత సత్యాలు నేర్చుకుంటాడు, స్నేహాలు చేసుకుంటాడు, పడ్తాడు లేస్తాడు, మంచి చేసే ప్రయత్నంలో హాని చేస్తాడు, ఏడుస్తాడు, ఎదుగుతాడు, పాప ప్రక్షాళన చేసుకొని ఒక కొత్త మెచ్యూరిటీ తో ఇల్లు చేరుకుంటాడు. అయితే ఈ కొత్త రచయితలు దర్శకులు దీనికి social consciousness ని జోడిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది dialectical materialism. తమిళ్ సినిమాల్లోనూ deification తగ్గింది.

ఈ కథలు కేవలం హీరో జర్నీ గురించే కాదు. సమాజం ఎలా ఉంది, కథలో కీలక పాత్రలు ఎలా ఉంటారు, ఎందుకలా ఉంటారు, వాళ్ళ కట్టు బొట్టు ఆహారం వ్యయహార శైలి కులం వర్గం, వారి ఆలోచనల చర్యల పర్యావసానం సమాజం పైన ఎలా ఉంటుంది.

ఈ నాలుగు సినిమాల్లో ఈ లక్షణాలను సంక్షిప్తంగా చెప్పాలంటే (spoilers ahead)-

c/o కంచరపాలెం- ఈ సినిమాలో explicit గా దెవుడి గురించి ప్రస్తావన ఉంటుంది, కుల మతాల గురించి, కుల మతాల పేర్లమీద గుంపులు చేసే అరాచకాల గురించి. కానీ అన్నిటికీ మించి ఈ సినిమా దేవుడి నిశ్శబ్దం గురించి (the silence of god). ప్రపంచ సినిమాలో ఈ ఐడియా మీద ఎంతో మంది గొప్ప దర్శకులు సినిమాలు తీసారు- ఇంగ్మార్ బెర్గ్మన్, వుడీ అలెన్, మార్టిన్ స్కొర్సేసే. భారతీయ సినిమాల్లో ఉండే ఉంటుంది, నాకు తెలియదు. మీకు తెలిస్తే దయచేసి తెలియగలరు. ఈ సినిమాలో హీరో దేవుణ్ణి ప్రార్థిస్తాడు, దేవుడు అటకాయిస్తాడు. ఇంకో దేవుణ్ణి ప్రాధేయపడ్తాడు. అక్కడా అదే పరిస్థితి. మళ్ళీ మళ్ళీ అదే అయ్యే సరికి ఏడుస్తాడు, చిరాకు పడ్తాడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, ఆఖరికి ఆ ప్రయత్నాలు వదిలేసి వాడికి చేతనైన పని చేసుకుంటాడు. ఊరిని ఉద్ధరించటం దేవుడెరుగు, వాడి జీవితంలో కోరుకున్నది ఏది సొంతంగ సాధించుకోలేడు. ఇలాంటి కథానాయకుడు తెలుగులో అసాధారణం. ఇలాంటి కథ నూతనం.

ఫలక్నుమా దాస్- నిజం ఒప్పుకోవాలంటే ఈ సినిమాలో హీరో పెద్దగా మారడు- కమర్షియల్ హీరోలా మొదట్లో ఎలా ప్రవర్తిస్తాడో చివర్లోనూ అదే ఆటిట్యూడ్‌తో ఉంటాడు. అయితే ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే హీరో మనం నార్మల్గా హీరో చేయకూడని విధంగా ప్రవర్తించినా, కమర్షియల్ హీరో చేసినప్పుడు చుట్టూ ఉన్న పాత్రలు వెనకేసుకొచ్చినట్టు దీంట్లో ఆ చర్యలకి greater good ముసుగ వేయరు, వాడు ఏ విధంగానూ పశ్చాతాప పడినట్లు ఉండదు. 'వాడి పాపాన వాడు పోయాడు' అని చెప్పలేము. కర్మ వాడిని శిక్షించదు. అవును కొన్ని కష్టాలు పడ్తాడు కానీ అది రాండెం గానే ఉంటుంది, ఆ కాంప్లికేటెడ్ నెట్వర్క్‌లో ఈవెంట్స్ గానే చూపెడ్తారు కానీ ఏదో overarching teleology ఉండదు. మనుషులు వాళ్ళ గొడవల్లో, అలవాట్లలో లక్షణాలతో వాళ్ళకి కావల్సిన వాటి గురించి ఉబలాట పడ్తారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారు. దేవుడి అవసరం లేదు.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ- ఈ సినిమా explicit గా మతానికి, నమ్మకాలకి సంభంధించిన నేరాల గురించి మాట్లాడుతుంది. Modern, rational detective against superstitious belief and the business of faith. నేను చాలా మంది కోరికలు కోరే భక్తులని అడిగే ప్రశ్న- దేవుడు గొప్పవాడు మంచి వాడు అయితే అడిగే దాకా ఎందుకు తీర్చడని. (it’s a different issue that that question leads to so many other questions). అయినా దేవుడెందుకు "చెడు" ని సృష్టించాడని. దేవుడు నీ మంచి చెడు తెలిసే చేస్తున్నాడు కదా. మరి మధ్యలో నువ్వు అడిగేసి కెలికెయటం ఏంటని. వాళ్ళేదో చెప్తారు. అయితే ఈ సినిమాలో నమ్మని వాళ్ళకి అడగని వాళ్ళకే కాదు, నమ్మి ప్రాధేయపడుతున్న వాళ్ళకీ అన్యాయం జరుగుతున్నట్టు, అదీ డబ్బు కోసం అని చూస్తాము. ఈ సినిమా కి ఇంత మంచి పేరు రావటానికి కారణం ఇదేదో అజెండాలా కాక వార్తల్లో రోజు చూస్తున్న విషయాలను తీసుకొని ఇలా చూపించటం. చివర్లో విలన్లకి శిక్ష పడుతుంది కానీ అది హీరోకి respite ఇవ్వదు.

బ్రోచేవారెవరురా- ఈ సినిమా అయితే టైటల్ నుండే godless universeని invoke చేస్తుంది. "నిను బ్రోచేవారే లేరులే". నీ చర్యలకు ప్రతిఫలం ఉంటుంది. కానీ అది equal and symmetric గా ఉండదు. అది random గా ఉంటుంది, హింస కానీ ఊరట కానీ కేవలం మన చర్యల వల్ల రాదు. ‘అదృష్టం’ బాగుంటే సమస్య నుండి గట్టెక్కుతావ్ లెదంటే మునిగిపోతావ్. పారాహుషార్. నిజానికి పారాహుషార్ అన్నా ఉపయోగం లేదు. ఏది ఎందుకు ఎలా ఎప్పుడు అవుతుందో చెప్పలేవు. నీ అదృష్టం బగుంటే దానిని ఎదురుకొనే శక్తి దొరుకుతుంది. Again a non-teleological, opaque universe. (పూర్వ జన్మ కార్యాలకు ఇపుడు ప్రతిఫలం అనుభవిస్తున్నామేమొ. కాని నా current experience లో అది ఎందుకు ఎలా జరుగుతొందో తెలియనపుడు అది ఈ జన్మ అస్తిత్వం వరకు random)

హీరోలు వద్దు అంటే నా ఉద్దేషం extraordinary humans ఉండరని కాదు. అలాంటి వారు ఉంటారేమో, who by the sheer force of their will, personality or strength వాళ్ళ ఐడియాస్‌ని ప్రపంచం మీద impose చేసేవాళ్ళు- మంచికో చెడుకో. కానీ అలాంటి వారు vacuumలో ఉద్భవించరు, ప్రపంచం తో react అవుతు మారుతు మార్చుకుంటు వస్తూంటారు. సినిమా, for that matter any story, primary idea అదే కదా. నా లాంటి ఒక మనిషి moral, emotional or physical quandry లో ఉంటే వాడు ఏం చేస్తాడు, ఏం ఆలోచిస్తాడు, ఎలా ఉంటాడు.

దేవుడు లాంటి హీరో వచ్చి రక్షిస్తాడు అనే సాంప్రదాయం నుండి మనలోనే దేవుడున్నాడు అనే భావజాలం నుండి ఇపుడు దైవత్వం లేదు, ఎవడూ ఉధ్ధరించలేడు, మానవత్వం ఏ మన దగ్గర ఉన్నది అన్న చోటికి వచ్చాయి కథలు. ఇది సరియైన పరిణామమా కాదా అన్నది నేను ప్రస్తావించలేదు. నాకు కనబడిన evolution ని మీకు ప్రెసెంట్ చెస్తున్నాను.

No comments: