Monday, October 22, 2018

All solace is temporary

ఇదే ఇంతే.. కానీ సరిగ్గా చూస్తే ఇదే ఎంతో

మన దినచర్యలో ఎన్ని పనులు జీవికి, ఎన్ని జీవితానికి? జీవికంటే survival కోసం చేసే చర్యలు, జీవితానికంటే దానికన్నా ఉన్నతమైన అనుభవాలు పొందటానికి చేసే పనులు. ఉదాహరణకు: జీవికోసం Soylent ఉంటే సరిపోతుందిట, జీవితం కోసం ఆవకాయ, ముద్ద పప్పు, గుత్తి వంకాయ, పచ్చి పులుసు వగైరా వగైరాలు కావాలి కదా. అదన్నమాట.

మన దైనిక జీవితానికీ జంతువుల దైనిక జీవితానికీ పెద్ద తేడాలేదు: అవీ రోజంతా ఆహారం కోసం వెంపర్లాడుతాయి, మనమూ రోజంతా ఆ గొడవలోనే గడుపుతున్నాము. ఆ ఆకలి జంతువుకైతే తిండి రూపం దాలుస్తుంది, శారీరిక సుఖ రూపం దాలుస్తుంది. మనం జంతువులకన్నా ఒక మెట్టు పైనున్నామని మనకి అహంకారం గనుక అవి కాక మనకి పరపతంటే ఆకలి. అందరూ నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, నా గురించి గొప్పలు చెప్పుకోవాలి, నేను పోయాక నన్ను తలుచుకుంటూ నా గురించి కథలు కథలుగా మాట్లాడుకోవాలి అనే ఆకలి.

నాకు బ్రతుకంటే ఆశ. నాకున్న అతి పెద్ద భయం: ఒక రోజు ఈ జీవితానికి నేను స్వస్తి చెప్పాల్సి వస్తుందని. అదేంటో గమ్మత్తు, మనం అడగకుండా ఇచ్చిన దాన్ని ఇచ్చినవాడు తిరిగి తీసేసుకుంటాడేమోనని భయం. నా మెదడుకి (మెదడుకా, మనసుకా? ఏమో.. రెంటిలో ఒకదానికైతే) తెలుసు ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకెళ్ళమని, నాదెగ్గరున్న ఆస్తల్లా ఈ క్షణమేనని. కానీ నేను బ్రతికే విధానం ఈ నిజాన్ని గౌరవించటంలేదు. నా జీవితానికి మూలం అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఇదే సమయం. చిన్న తనమంతా అల్లరిలో గడిచిపోయింది. వృద్ధాప్యం, ఉంటే, అలిసిన శరీరాన్నీ మెదడుని మనసునీ, కుదిపివేస్తున్న అసంతృప్తిని, యవ్వనంలో కొన్ని పనులు చేసినందుకు, కొన్ని చేయనందుకు పడుతున్న పశ్చాతాపాన్ని సముఝాయించుకోటానికే సరిపోతుంది.

అసలేంటిదంతా. నా జీవితానికి నేను బాధ్యత తీసుకోవాలి. ఎవరేమనుకున్నా, ఎవరేమన్నా నా శోధన నాది, వాటి ఫలితాలు పరిశీలించి మార్పులు చేర్పులు చేస్కొని నన్ను నేను ఉద్ధరించుకునే కర్తవ్యం నాది. దీనికి నాకు కావల్సినవి ధైర్యం, వినయం, ఓర్పు, బుద్ధి. ఆ ఓల్డ్-స్కూల్ విలువలు.

మరి ఇప్పుడు నేను ఇతరులేమనుకుంటారు అని ఆలోచిస్తూ బ్రతకటం ఏంటి. దానికర్థం అడ్డమైన వేషాలేయమని కాదు. మనిషికి కుతూహలం సహజ గుణం. నేను ఈ ప్రశ్నలు చాలా అడిగేది ఒకప్పుడు. కానీ ఎప్పుడూ దీక్షతో సమాధానాన్ని వెతుకలేదు. పొగరుగా ప్రశ్నలు వేయటం సెక్సీ గా ఉంటుంది, నిజంగా సమాధానాలు రాబట్టాలంటే ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి, మన మీద మనకి గౌరవం కలిగేలా మనం ప్రవర్తించాలి. ఇది తెలుసుకోటానికి ఇన్నేళ్ళు పట్టింది.

ఏదైనప్పటికీ జీవితం ఇలానే ఉంటుంది, రోజూ ఏదో అద్భుతం ఎప్పటికీ జరగదు. అలా జరిగితే అదీ అలవాటైపోతుంది. మనిషి మనస్తత్వమే అలాంటిది- ఏదో గొప్ప విషయం (అది మంచిదీ కావచ్చు, ఉపద్రవమూ కావచ్చు) ఈరోజు జరిగితే, అది ఎల్లూండికి పాతబడిపోతుంది. లేకుంటే ఈ శరీరము, ఆలోచించే మెదడు, ఇన్ని అద్భుతమైన విషయాలను చూసి విని రుచిచూసి పీల్చి స్పర్శించగల పంచేంద్రియాలు, అవసరమైనంత సంపాదించుకోగలగటానికి కాస్తో కూస్తో నేర్పు.. ఒక్క నిమిషం ఆలోచించండి, మనం ఈశ్వరుణ్ణి కోరుకోగలిగినా కూడా ఇంతకంటే గొప్ప కోరికలు కోరుకోగలమా? మనం అడగకుండానే అమ్మవారు ఇచ్చిందే, వీటిని పద్ధతిగా వాడుకుంటే, మనిషిలా బ్రతికితే ఇంతకు మించిన జన్మ ఉంటుందా.

కవితల్లో రాసేది, ప్రవచనాల్లో చెప్పేది నిజమే అనిపిస్తోంది.. నువ్వు చీకట్లో భయంగా పరిగెడుతూ తడబడుతూ వెతుకున్న దీపం నీలోనే ఉంది. దాన్ని నిన్ను దహించే మంటగా మార్చుకుంటావో లేక వెలుగు ప్రసాదించి నిన్ను నీ గమ్యానికి చేర్చే వరంలా చూసుకుంటావో నీ చేతుల్లో ఉంది. సృష్టిని అర్థం చేయించగలిగే నిజం ఇంత సాధారణంగా ఉంటుందా ఏంటి అని నాకూ అనిపించేది. కానీ ఈ సంద్రంలోని లోతు ఎంతో.

ఇవే మాటలు చలా ఏళ్ళు నాకు ఎవడన్నా చెప్పుంటే చెప్పే వాడు వెర్రిముండాకొడుకు అనుకునే వాడిని. కానీ ఇపుడు ఇదే నిజం అనిపిస్తోంది, ఈ నిజం ధైర్యానిస్తోంది, శక్తినిస్తోంది, జ్ఞానార్జనకు ఎంతో ముఖ్యమైన వినయాన్ని గుర్తు చేస్తోంది. ఈ నిజం నాలో ఇంకాలి, ప్రతీ క్షణం సరిగ్గా బ్రతికేట్టు నా ప్రతి కణంలోనుండి పారాలి.

ఎవరికీ చెప్పేంత వాడిని కాను. కానీ ఒక విచారము- మనం ఎప్పుడు ఏది చేయాలో అది మన ముందే ఉంటుంది, ఇది చెయ్యి అని మన మనస్సు చెప్తూనే ఉంటుంది. అలా గుసగుసలాడే మనసు మాట వినబడేంత సున్నితత్వం అలవర్చుకోవటం మాత్రం మన కర్తవ్యం.

వందే గురు పరంపరాం.

--

I can't believe I wrote the above post. Glad I decided to sit on it for 10 days. Now as I read it, God, it feels awfully fake. Forget the content, even the voice doesn't sound like mine. It is too assured, too  confident of the speaker's theories. But I can honestly attest that when I wrote it, I had no intention of portraying anything like that in specific. I wrote like I always do, following the thoughts popping up.

In Woody Allen's brilliant Zelig, the protagonist feels such a constant need to agree with those who he's with, that he inadvertently turns into them. Thankfully, my condition is not that bad. Truth be told, I like being like that; Being able to converse with whoever I am with by sharing their worldview. Though to see that happen at the cost of my individuality (commendable from a Yogic perspective?) is unnerving.

Epiphany is a recurring motif in my adult life. Minor ones happen multiple times everyday. Major ones only slightly infrequently. Molecules in the universe rearrange themselves so that I clearly see the pattern amidst the chaos. I feel good, elated, confident. Glad. I create elegant theories, make plans on how to live from now, start walking towards the destination with firm, confident steps. Then reality intervenes and clarity evaporates. It leaves the residue of fantasy that, in the new light, looks ludicrously desperate.

On good days, I stay in the state of confusion. Irritated, subdued, tethered. On bad days, my mind comes up with a more outlandish theory on how to live that considers the feedback received from the previous theory as an important variable. Theory of Reflexivity gone awry, a feedback loop of feedback loops. All theories only seek data they need. Even metatheories.

--

I had a pleasant dream last evening. A cinematic analogy of what I feel when I face the blank page. I'm a 15 year old girl sitting in a classroom, madly deeply in love with a boy who's in the same class. The sunlight is warming my face, I'm feeling deliriously good about being alive, thinking about the boy. My stomach is tingling with the knowledge that he and I are separated only by a few feet. That I'm breathing in the air that is coming out of him. I tuck the hair falling out of my hair behind my ear. I absent-mindedly touch my earlobe, feeling womanhood in every inch of my body. I feel a maddening heat growing between my legs and so I lower my head, and turn it back slightly to the left so that I can see him. As his image courses through my being, my stomach does a somersault. I feel very nervous, very unsure but pleasure is gushing from every cell in my body.

When I sit in front of a blank page, I feel this. Love.

1 comment:

Deekshith said...

Such a paradigmatic difference in the texture of two languages and their carried meanings. This, in a way, stands for the conflicting lives we all live. To be or to not be. While the aboriginal text in Telugu speaks of the writer with a penchant for some higher living, the second one has him chasing unadulterated pleasure - purest and unmarred.

And this: పొగరుగా ప్రశ్నలు వేయటం సెక్సీ గా ఉంటుంది, నిజంగా సమాధానాలు రాబట్టాలంటే ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి, మన మీద మనకి గౌరవం కలిగేలా మనం ప్రవర్తించాలి. ఇది తెలుసుకోటానికి ఇన్నేళ్ళు పట్టింది. - I have always believed that everyone knew this subcutaneously but coming to grips with it in your conscious mind only marks one thing for me as a reader - you're making peace with who you are. And it's such a comforting thing.