The seed for this story was planted a long time ago. I kept wanting to write it but it never happened mostly because I never sat down to finish it. And also that, like anyone's who's trying to create, I was shadowed by demons of procrastination, lack of confidence, fear of how the story would manifest itself and if I won't like its course, and that perpetual dilemma whether to write something as close to my heart with my imperfect craft or to safe keep it until I reached a certain level of mastery. Eventually though, the story happened because I was working on another story, and it wasn't going anywhere, and I kept missing deadlines given to Meher anna when inspiration finally stuck. The kind of inspiration that Bill Watterson talks about in one of Calvin and Hobbes' strips: Last minute panic. I finished the first draft in a state of daze in a few hours and when I read it, it didn't seem that bad. So, I sent it across for publication and I'm glad a few people liked it and made an effort to let me know. I'm humbled by their support.
--
90s బ్లూస్
Posted on సెప్టెంబర్ 5, 2014 by శిరీష్ ఆదిత్య
Download PDF ePub MOBI
మా ముత్తమ్మమ్మ డెభ్భైయేళ్ళ శాంతి జరిగినపుడు నాకు ఎనిమిదేళ్ళు. ఆ రోజు ఇంట్లో అంతా హడావిడి. ఎప్పుడో తెల్లవారుఝామున మొదలయిన పూజలు, సూర్యుడు మధ్యాకాశంలో తాండవం చేస్తున్నా ఇంకా ముగియడం లేదు. కార్యక్రమాలు అన్నీ అయిపోయేదాకా, చేసిన పులిహోర-బొబ్బట్లు ఎవ్వరికీ పెట్టేదిలేదని అమ్మ తీర్మానం చేసేసింది. పొద్దునే తాగిన గ్లాసుడు పాలు ఎప్పుడో ఆవిరైపోయాయి. అంత ఆకలితో అసలే చిరాగ్గా ఉన్న నన్ను చుట్టాలందరూ పిలిచి ఏం చదువుతున్నావ్, ఎలా చదువుతున్నావని అడుగుతున్నారు. అది సరిపోదన్నట్టు మా పెద్దతాత నన్ను దగ్గరకు పిలిచి పక్కనున్న ఇంకో పెద్దాయనకు ప్రదర్శిస్తున్నాడు.
“అరేయ్ పంకుగా, ఇట్రారా! వీడు మా ఆఖరి తోడల్లుడి మనవడండి. సరస్వతి కొడుకు. వట్టి అల్లరి పిడుగు. ఇలా చూసేలోపు అలా తుర్రుమంటాడు”
నేను చిరాగ్గా మొహం పెట్టడం చూసిన ఆ పెద్దాయన నవ్వి, “ఏం చదువుతున్నావు బాబు?”, అనడిగాడు.
“ఫోర్త్ క్లాస్ తాత”, అంటూ పట్టు వదిలించుకొని పారిపోబోయా.
“ఉండరా పిడుగా. స్కూల్లో చాలా అల్లరి చేస్తావట, మార్కులు కూడా తక్కువట. నాకన్నీ తెలుస్తూంటాయి. అమ్మమ్మ-తాతల గారాబమండి,” అని ఆ పెద్దాయనకు చెప్పసాగాడు.
అప్పుడే చేతిలో రెండు బిందెలు పట్టుకుని హడావిడిగా వెళుతున్న మామను చూసి,” యేరా చంటి. మీ పెద్దమ్మ అంటూంటుంది వీడు అచ్చం నీ పోలికేనని. చదువబ్బడం లేదుటకదా? ఈ వయసులోనే అదుపులో పెట్టాలి లేదంటే నీ లాగే గాలికి తిరుగుతూ ఎందుకూ పనికిరాకుండ పోతాడు”, అని నవ్వాడు మా పెద్దతాత.
“మా మామ ఏమి పనికిరానివాడు కాదు”, అన్నాన్నేను రోషంగా.
అంతలో మామ నవ్వుతూ, “వాడికంత కెపాకిటి లేదులే పెదనాన్న,” అన్నాడు.
“కెపాకిటి ఏవిట్రా?” అనడిగాడాయన ఆశ్చర్యంగా.
“కెపాకిటి తెలీదా? ఒకానొకప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్లాడుండేవాడట. చదువులన్నీ బాగానే ఉండేవిగాని వాడికి ‘స’ సరిగ్గా పలికేది కాదు. ఒకరోజు వాడి టీచరు వాడి నాన్నను స్కూలుకు పిలిచి మీ అబ్బాయి ఎలెక్ట్రిసిటి ని ఎలెక్ట్రికిటి, పబ్లిసిటి ని పబ్లికిటి అంటాడు, మీరన్నా కాస్త చెప్పండనింది. దానికి ఆ తండ్రి, పోనీలెండి మేడం మా వాడి కెపాకిటియే అంత అన్నాడట”
దానికి ఆ పెద్దాళ్ళిద్దరూ నవ్వేసారు. మామ నన్ను కాపాడే హీరోగా మళ్ళీ అవతారమెత్తాడు.
నాకు ఊహ తెలిసినప్పటినుండి నేనూ మామా ఒకే జట్టు. నాన్నంటే ఇష్టమున్నా కొంచం భయముండేది. అమ్మ లాడు చేసినా అల్లరి మితిమీరితే కోప్పడేసేది. తాత అమ్మమ్మా గారాబం చేసినా, నాకూ అక్కకూ గొడవైతే, “ఆడపిల్ల కదరా, అందులోనూ అక్క. పోనీలేరా,” అని దాన్నే వెనకేసుకొచ్చేవారు. నేను ఎంత వెధవ పని చేసినా, ఎంత మంది తిట్టినా, ఎన్ని సబ్జెక్టులు ఫెయిలైనా మామ మాత్రం వెనకేసుకొచ్చేవాడు.
“పిల్లలే కదే అల్లరి చేసేది” అని అమ్మకి నచ్చజెప్పి, “అబ్బా చదువుతాడ్లేవే, వాడేదో పి.హెచ్.డి. చేస్తున్నట్టు” అని అమ్మమ్మ మీద కేకలేసి, “నేను చెప్తాను బావగారు, ఈ సారి తప్పకుండ టాప్ 5 లో వస్తావు కదరా” అని నాన్న ముందు విధేయత నటింపజేసి ఆఖరకు తాత చేతిలో చివాట్లు తినేవాడు.
“నువ్వు ఎలాగో ఎందుకూ పనికి రాకుండా పోతావు. వాడ్నెందుకురా చెడగొడతావు. వాడూ నీలాగే పైసకి పనికి రాడు” అని తాత మామ మీద కేకలేసేటప్పుడు నాకు చాలా కోపమొచ్చేది. ఏమి అనలేక గుడ్లురుముతూ, పళ్ళు కొరుకుతూ ఉన్న నన్ను చూసి తాత, “ఏరా మీ మామని అంటున్నాననా? నా ముందా నీ రోషం. ఇంత గారబం చేసే ఇలా చెడిపొయావు–”
“నేను ఫెయిల్ అయితే మామనెందుకంటావ్? నన్ను–”
అప్పుడు వినే వాడిని మామ స్వరంలో కోపం.
“చిన్నా! ఏంటది పెద్దాచిన్నా లేకుండ. నోర్మూయ్”, అని మామ అనగానే చల్లబడిపోయేవాడిని.
నా వల్ల ఎన్ని సార్లు తిట్లు తిన్నా, ఒక్కసారి కూడా పరీక్షల కోసం చదువుకో అని చెప్పలేదు మామ. పరీక్షలంటె ఎప్పుడూ లెక్క లేదు మామకి.
అమ్మ మామలు ఇద్దరే కావడం వల్లనేమో ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా మమకారం. అమ్మ మీద ప్రేమంతా అక్క మీద, నా మీద చూపించేవాడు. నా చిన్నప్పటి నుండి నావన్నీ మామ పోలికలని అందరూ అనేవారు. దాంతో తెలిసీ తెలియకుండానే మా ఇద్దరి మధ్య చాలా గాఢమైన బంధం ఏర్పడిపోయింది. నా చిన్నతనంలో మేము అమ్మమ్మ-తాతల ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. అప్పుడే మామ డిగ్రీ అయిపోయి, చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ, తను పుట్టి పెరిగిన ఆ కాలనీలోనే తన స్నేహితులతో తిరుగుతూ, సినిమాలు చూస్తూ, ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. తాత భాషలో చెప్పాలంటే లక్ష్యం లేకుండ తిరిగేవాడు. ఆ రోజుల్లో నేను కొన్ని రాత్రులు మా ఇంట్లో పడుకుంటే మిగతా రాత్రులన్నీ మామ పక్కలోనే. తను ఏవేవో చెప్తూండేవాడు, నేను కళ్ళార్పకుండ వింటూండేవాడిని. మామకి వ్యాపారం చేయాలని కోరిక కానీ స్తోమత సరిపోదు. ఆ ప్రయత్నంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ, పరిచయాలు పెంచుకుంటూ తాహతుకి మించిన ప్లాన్లు వేసేవాడు.
తాతకేమో మామ ఏ బాంకు లోనో, గవర్నమెంట్లోనో ఉద్యోగం సంపాదించాలనుండేది. మామకి ఆ జీవితం ససేమిరా ఆమోదం కాదు.
“ప్రతి నెలాఖరుకు జీతం చేతికొస్తుంది. ఏ పేచీ ఉండదు. రాజా లాంటి ఉద్యోగంరా అది”, అని తాత అనేవాడు.
దానికి మామ, “నాకొద్దు అలాంటి జీవితం. నచ్చిన పని చేస్తూ నలుగురికి అన్నం పెట్టే పని చేయాలి. ఏదో తిన్నామా, పడుకున్నామా అనుకోడానికి నేను కూపస్తమండూకాన్ని కాదు నాన్న”, అని తిరుగుజవాబిచ్చేవాడు.
అమ్మమ్మ గొడవ చల్లార్చే లోపే తాత మళ్ళీ అందుకొని, “అయినా చేతకానివాడి మాటలివన్నీ. మనకు రానిది మనకొద్దూ, అఖ్కర్లేదూ అనుకుంటే హాయిగా బతికేయొచ్చు కదా,” అనేసరికి మామ కోపంగా వెళ్ళిపోయేవాడు.
ఈ తంతు దాదాపు ప్రతి రోజూ నడిచేది. మరీ పెద్ద వాగ్వివాదం అయిన నాడు మామ భోంచేయకుండా వెళ్ళిపోయేవాడు. తాత అప్పట్లో అన్ని మాటలు అన్నా, నేను పెద్దవుతున్న కొద్దీ ఆయన మాటల్లో తెలిసొచ్చింది ఆయనకు కొడుకు మీద ఎంత ప్రేమా, వాత్సల్యముందని.
ఆ మాటకొస్తే మా నాన్నకు కూడా బావమరిది మీద చాలా అభిమానం. ఎప్పుడూ మామతో చెప్పకపోయినా అమ్మతో అనడం నేను చాలా సార్లు విన్నాను. అమ్మ రాత్రి భోజనం వడ్డిస్తున్న సమయాల్లో, “సరస్వతి, చంటి తెలివైన వాడు. కానీ ఈ కాలంలో చేతిలో పట్టా లేనిదే మనం ఎంత యోగ్యులమైనా ఎవడూ పట్టించుకోడు. వాడిని ఎం.బి.ఎ చేయమను. మంచి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఉద్యోగంలో చేరితే కాస్త బాధ్యత తెలుస్తుంది. ఇక ఒక రెండు మూడేళ్ళల్లో ఓ మంచి పిల్లని చూసి కట్టబెడితే వాడి బతుకు వాడు బతుకుతాడు. వాడికున్న తెలివితేటలకి ఇంకా ఆ అల్లరి మూకతో తిరిగి భవిష్యత్తు నాశనం చేసుకునేదాక మనమాగొద్దు… చాలు, పెరుగు వెయ్యి,” అంటూండే వాడు.
నాన్న అల్లరి మూక కింద జమకట్టిన వాళ్ళంతా మామ క్లోజ్ ఫ్రెండ్స్. మామ స్నేహితులు కావడంతో వాళ్ళూ నాకు మామలైపోయారు- రవి మామ, వాసు మామ, శీను మామ. క్రికెట్ ఆడటానికైనా, సినిమాలు చూడటానికైనా, కాలనీలో గొడవలకైనా కలిసి వెళ్ళేవాళ్ళు. నేను కాస్త పెద్దైన తరువాత నన్ను కూడా వెంటబెట్టుకొని తిరిగేవాడు మామ. నా జీవితపు మొట్టమొదటి ఫస్ట్ డే, ఫస్ట్ షో చిరంజీవి సినిమా మామే తీసుకెళ్ళాడు సుదర్శన్ 70mmలో. నేను నేర్చుకున్న మొట్టమొదటి బూతు కూడా మామ దగ్గరే. మామకప్పట్లో ఒక కవాసాకి బైకుండేది. ఇప్పుడు ఆలోచిస్తూంటే డొక్కు బండి అనిపిస్తున్నా, అప్పట్లో దాని టాంకు మీద కూర్చొని వెళుతోంటే ఏదో రథం మీద స్వారీ చేస్తున్న ఫీలింగుండేది. అలా ఓ రోజు నేనూ, మామ బండి మీద పోతూంటే దారికడ్డొచ్చిన ఒకడ్ని మామ ‘బాడకవ్’ అని తిట్టాడు. ఆ పదం ఎందుకో నాకు చాలా నచ్చేసింది. కొన్ని రోజుల తరువాత అమ్మ వంట చేస్తూ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని చదివిస్తోంది. ఏదో మాటల్లో అమ్మ, “హరి వాళ్ళ అమ్మ కనబడిందిరా కూరగాయల షాపులో. వాడికి మళ్ళీ ఫస్ట్ రాంక్ అట. భలే పద్ధతిగా ఉంటాడు కదరా ఆ పిల్లాడు” అని వాడిని మెచ్చుకోగానే వాడి మీద నాకున్న అక్కసంతా ఒకేసారి బయటికొచ్చి, “వాడు బాడ్కౌ గాడు” అనేసా.
అమ్మ మొహంలో సట్టున వచ్చిన కోపాన్ని చూడగానే అర్థమైంది నేను చచ్చానని. అనుకున్నట్టే చెంప ఛెళ్ళుమంది. “ఎక్కడ నేర్చుకుంటున్నావురా ఇలాంటి మాటలు,” అని అరిచింది. నేనేం మాట్లాడలేదు. బాగా కొట్టింది. నా ఏడుపు ఆగిన తరవాత తను ఏడుస్తూనే మందు రాసింది.
ఈ సమయానికే ఇండియాలో సాఫ్టువేరు బూమ్ వచ్చేసినా మామకి సాఫ్టువేరు పైన ఆసక్తి లేకపోవడంతో ఇన్నాళ్ళూ ప్రయత్నం చేయలేదు. కానీ తాత అప్పుచేసి ఇల్లు కట్టడం వలన ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అవకాశాలు బాగుంటాయని నలుగురూ చెబితే మామ ఒరకిల్ నేర్చుకున్నాడు. అప్పుడే నేను అయిదవ తరగతి తప్పడంతో అమ్మా నాన్న నన్ను హాస్టల్లో వేయడానికి నిర్ణయించుకున్నారు.
నేను హాస్టలు జీవితానికి అలవాటు పడే కాలానికి మామ బిజీ అయిపోయాడు. అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో, అక్కడొక నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించొచ్చని ఇష్టం లేకున్నా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తన ప్రయాణం వారంలో అనగా ఇంట్లో పనులు మొదలైపోయాయి. ఎవరెవరో చుట్టాలు వచ్చి వెళుతున్నారు.
“నాకు తెలుసండి, వీడు ఎప్పటికైనా ప్రయోజకుడవుతాడని. వయసు ప్రభావం వల్ల కాస్త నిర్లక్ష్యంగా కనిపించేవాడే గానీ తెలివితేటలకి ఎటువంటి కొదవా లేదు,” అని ఒక పెద్దావిడ కనబడిన వాళ్ళకి చెబుతోంది.
అందరికీ మామ అమెరికాకి వెళుతున్నాడన్న సంతోషం, వెళ్ళిపోతున్నాడు అన్న దుఃఖంగా మారింది. ఇంట్లో వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైనారు. తాత వచ్చిన వాళ్ళందరి ముందు మామని పిలిచి ఎక్కడికెళ్తున్నాడో, ఏం పనో చెప్పమంటున్నాడు. అమ్మమ్మ పొళ్ళూ, పచ్చళ్ళూ కడుతూ కళ్ళు తుడుచుకుంటోంది.
“ఎందుకమ్మమ్మా ఏడుస్తున్నావ్?” అని అడిగితే, నవ్వి ముద్దుపెట్టి అరిసిచ్చింది. అమ్మేమో వచ్చిన వాళ్ళకి కాఫీలిస్తూ మామ తీసుకెళ్ళాళ్సిన ఐటమ్స్ లిస్టు చెక్ చేసుకుంటోంది.
ప్రయాణం రోజు రానే వచ్చింది. మంచి బట్టలేసుకొని, మొహాలకు పౌడర్లు రాసుకొని నాలుగు కార్లల్లో జనం కిక్కిరిసి ఎయిర్పోర్టుకు బయలుదేరాము. నేనూ మామ పక్కనే కూర్చున్నా కారులో ఎవరమూ పెద్దగా మాట్లాడలేదు. ఎయిర్పోర్టుకు చేరి లగేజి అప్పగించేసాక, ఒక్కొకర్నీ పలకరిస్తూ మామ నా దగ్గరికొచ్చాడు. నేను ఏడుపాపుకోడానికి ప్రయత్నిస్తూ తల నేలకు వాల్చి గుంభనంగా నిలుచున్నాను. మామ దగ్గరకు రావడం గమనించి తలపైకెత్తి బలవంతంగా నవ్వాను.
“హీరో! ఇంక నువ్వే అన్నీ చూసుకోవాలి. పెద్దవాడివౌతున్నావు. అమ్మమ్మ-తాతలకు ఏం కావాలన్నా దగ్గర్నుండి చూసుకో. అమ్మ జాగ్రత్త. అక్కతో కొట్లాడొద్దు. నీకు ఏం కావాలన్నా నాకు చెప్పు. సరేనా? నేను తీసుకొస్తాను,” అన్నాడు.
నేను తెచ్చిపెట్టుకున్న నిగ్రహం కోల్పోయాను. మామను గట్టిగా పట్టుకొనేడ్చాను.
మామ వెళ్ళిన కొన్ని రోజులకు మామ సామాన్లు సర్దుతూంటే ఒక డబ్బా నిండా పాత హిందీ సినిమా పాటల కాసెట్లు దొరికాయి. రఫీ, కిషోర్, ముకేష్ లంటే మామకు చాలా ఇష్టం. మళ్ళీ వాళ్ళల్లో కిషోర్ కుమార్ పాటలంటే ప్రాణం. ఆయన పాటలు వింటునప్పుడు మామ ప్రపంచాన్ని మరిచిపోయి తన్మయత్వంలో మునిగిపోయేవాడు. జిందగి ఎక్ సఫర్ ట్యూన్ని అద్భుతంగా విజిల్ వేసేవాడు. ఆ కాసెట్లు వినీ వినే నేను రఫీ మీద ఇంత అభిమానం పెంచుకున్నానేమో.
తను అమెరికా వెళ్ళిన కొత్తలో మేమిద్దరం తరచూ మాట్లాడినా క్రమేపి మా మధ్య మాటలు తగ్గాయి. మామ బిజీ అయిపోయాడు. నేనూ నా హాస్టలు జీవితంలో మునిగిపోయాను. అమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో ఉన్నప్పుడు మామ ఫోను వస్తే ఓ రెండు నిమిషాలు మాట్లాడేవాడిని. కుశల ప్రశ్నలు వేసుకున్నాక ఏం మాట్లాడాలో తోచేది కాదు.
వెళ్ళిన నాలుగేళ్ళకి మామ తిరిగొచ్చాడు. ఏం తేవాలో చెప్పమన్నాడు. అమ్మ ముందే హెచ్చరించడంతో ఏమొద్దన్నా. మామే బట్టలూ, విడియో గేమ్సు తెచ్చాడు. అమెరికా బట్టలేసుకొని తిరుగుతున్నందుకు నేను స్కూల్లో చిన్న సైజు సెలెబ్రిటీనైపోయా.
మామ పెళ్ళైంది. అప్పుడే మా నానమ్మ చనిపోవడంతో మామతో ఎక్కువ సమయం ఉండే అవకాశం దొరకలేదు. కళ్ళు మూసి తెరిచేలోపు మామ వెళ్ళిపోయాడు. చూస్తూనే ఏళ్ళు గడిచిపోయాయి. టెన్త్, ఇంటరు ఎటువంటి విపరీత పరిణామాలు లేకుండా నేను గట్టెక్కేయడంతో అమ్మా నాన్న ఊపిరి పీల్చుకున్నారు. అక్కతో వాళ్ళకు ఏనాడూ ఏ ఇబ్బందీ కలగలేదు. ఇంక నేను కూడా ఓ దారిలో పడ్డానన్న నమ్మకం వారికి కలిగింది.
ఇంటరు తరవాత ఏం చేయాలో స్పష్టత లేకపోవడంతో అందరిలాగానే నేనూ ఇంజినీరింగ్ లోనే చేరాను. మొదటి సంవత్సరం ఏదోలా గట్టెక్కిచ్చేసినా, రెండో సంవత్సరం నుండి బంకులు, నైటౌట్లు, కొత్త అలవాట్లు, కొత్త స్నేహాలు, అమ్మాయిలు, గొడవల పుణ్యాన అట్టెండెన్సు లేదని ఓ సంవత్సరం డీటెయిన్ చేసారు.
ఆ విషయం తెలిసిన రాత్రి నుండి అమ్మానాన్నలు నాతో మాట్లాడడం మానేసారు. అక్క మేమిద్దరమే ఉన్నప్పుడు తిట్టినా, వాళ్ళ ముందు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. “అమ్మ, చాలా మంది డీటెయిన్ అవుతారు. అది పెద్ద విషయం కాదు లేవే. అయినా ఇది ఒక రకంగా మంచిదే, ఫౌండేషన్ బాగవుతుంది,” అని చెప్పింది. అమ్మ ఏమీ మాట్లాడలేదు కానీ నాన్న లేచి వెళ్ళిపోయారు.
అమ్మమ్మ-తాతలకి విషయం తెలిసినప్పుడు తాత, “ఇప్పుడన్నా కాస్త బుద్ది తెచ్చుకొని పద్ధతిగా ఉండరా! మీ అమ్మ-నాన్న ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నారో నీకు తెలియనిది కాదు. వాళ్ళ కష్టానికి నువ్వు ఇచ్చే విలువ ఇదా”, అని మందలించాడు. అమ్మమ్మ మాత్రం “చెప్తూనే ఉన్నా, నీ స్నేహితులు సరిగ్గా లేర్రా అని. వాళ్ళళ్ళో ఒక్కడన్నా ఫెయిలయ్యాడా- లేదు కదా? నిన్ను మాత్రం చెడగొట్టారు గాడ్ది కొడుకులు. ఇంకోసారి ఎవడన్నా ఇంటికి రానివ్వు వాళ్ళ పని చెప్తాను”, అని అరిచింది. నాకు నవ్వొచింది. చిన్నప్పటినుండి నేను ఏ వెధవ పని చేసినా అది నా తప్పు కాదు కానీ వేరే వాడు నన్ను చెడగొడుతున్నాడని నమ్మే అమ్మమ్మ పిచ్చి ప్రేమ మీద ఆప్యాయత కలిగింది.
అమ్మ మామకి ఈ విషయం చెప్పినప్పుడు మామ ఏమంటాడో అని భయపడ్డా. పెద్దగా తిట్టలేదు కానీ ఒకప్పటిలాగా జోకులేసి ఏం పర్వాలేదనీ చెప్పలేదు. చేసేపని నచ్చకపోతే నచ్చిన పని చేయమన్నాడు. ఆయనే ఉంటే తెల్లచీరెందుకని, ఏం చేయాలో ఏం ఇష్టమో తెలిస్తే ఇంత గొడవెందుకని నోటిదాకా వచ్చింది.
అంతలోనే మామడిగాడు, “మొన్న నువ్వు పంపిన స్ట్రీట్ ఫొటోలు చూసాను. బాగున్నాయి. ఏం కెమెరా?”
“ఇంట్లో దొరికిన ఏదో పాత కెమెరా మామ. నిజంగా బాగున్నాయా?” అని ఆత్రంగా అడిగాను.
“ఆఁ. సీనుగాడు చూసి ప్రామిస్ ఉందన్నాడు. Keep at it”, అనేసరికి నా సంతోషం కట్టలు తెంచుకుంది. మాకు తెలిసిన వాళ్ళళ్ళో ఆయన ఉత్తమ ఫోటోగ్రాఫర్. ఆయన మెచ్చుకున్నాడంటే బానే తీస్తానేమోనన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలానో కాలేజీ లేదు, తిరగడానికి ఫ్రెండ్సూ ఖాళీగా లేరు అందుకని కెమెరా తీసుకొని రోడ్లమీద పడ్డా. మొదట్లో ఇంటి చుట్టుపక్క పరిసరాలు, పక్షులు, సూర్యోదయాలూ లాంటి నేచర్ ఫొటొగ్రఫీ వైపు మొగ్గు చూపించినా నెమ్మదిగా స్ట్రీట్ ఫొటొగ్రఫీ వైపు దారి మళ్ళాను. తెల్లవారుఝామున పని కోసం ఎదురు చూస్తున్న కూలీలు, రంజాన్ రాత్రుల్లో పాతబస్తీలో కనిపించే జనాలూ, బాంబు బ్లాస్టు అవగానే ఆ పరిసరాలు, క్రికెట్ మ్యాచుల్లో కోలాహలం సృష్టించే ప్రేక్షకులు- ఇలా మనిషి అనబడే సోషల్ యానిమల్ యొక్క వేరు వేరు కోణాలు తెలుసుకోవాలనిపించింది. అప్పటికే మామ ఎవరితోనో మంచి కెమెరా పంపి దానితో ఒక చిన్న నోటు జెతచేసాడు: Go, Capture Life. దానితో టెక్నాలజీ పైన దృష్టి పెట్టాను. ఐ.సొ.ఓ, షట్టర్ స్పీడ్, అపెర్చర్ సైజ్, ఫోకల్ లెంత్ తదితర విషయాలను అధ్యయనం చేసి, ప్రయోగాలు చేయడం మొదలెట్టాను. నేను తీసిన ఒక ఫొటొ ఒక ఆన్లైన్ మ్యాగజిన్ లో అచ్చైంది. బ్లాక్&వైట్- ఒక కారు అద్దంలోంచి ఒక పిల్లాడు బయటకి చూస్తూంటే, ఆ అద్దం మీద పడ్డ లేత ప్రతిబింబంలో అదే వయసు పిల్లాడింకొకడు పేపర్లమ్ముతున్నాడు. చాలా మంది బాగుందన్నారు. అమ్మ గర్వ పడింది, అక్క మెచ్చుకుంది. నాన్నతో ఇంకా మాటల్లేవు.
కాలేజీ మళ్ళీ మొదలయింది, ఆవారా తిరుగుళ్ళు తగ్గాయి. మార్కులు తారాస్థాయికి చేరకపోయినా, పాసు మాత్రం అయ్యాను. ఫొటొగ్రఫీ ఒక వ్యసనంగా మారింది. దాని గురించి విపరీతంగా చదివాను, ఫోటో ఫీచర్స్ తీయడం మొదలెట్టాను. ధర్నాలు, కొట్లాటలు, పండుగలు, ఎలెక్షన్సు, జాతరలు, నుమాయిష్- ఇలా జనం ఎక్కడ ఉంటే అక్కడికెళ్ళి ఫోటోలు తీసేవాడిని. చిన్నప్పటినుండి చాలా జాగ్రత్తగా పెంచబడి, అందమైన, భద్రమైన ప్రపంచం నా చుట్టూ సృష్టిస్తే అందులో పదిలంగా పెరిగిన నాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమైంది. సినిమాల్లో, పుస్తకాల్లో ఉండే మెరుగుపెట్టిన ప్రపంచం కాక యధార్థలోకమెదురైంది. ఫోటోలు అచ్చవుతున్నాయన్న సంతోషం ఉన్నా, కాస్తో కూస్తో డబ్బులొస్తున్నాయని ఉన్నా ఓ దశ తరువాత వాటికి పెద్ద పట్టింపు లేకుండా పోయింది. ప్రపంచాన్ని చూడ్డానికి వెళ్ళిన నాకు జీవితం యెదురైంది. మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారని, వాళ్ళ జీవన విధానాలు నా జీవితానికి ఇంత భిన్నంగా ఉంటుందని తెలిసొచ్చింది. ఈ దృశ్యాలు చూడ్డానికీ, ఈ ప్రదేశాలు వెళ్ళడానికీ, ఈ మనుషులను కలవడానికీ, నాలోని అనేక రూపాలను పరిచయం చేసుకోడానికీ కెమెరా ఒక సాకు మాత్రమే అయింది.
మొత్తానికి ఇంజినీరింగ్ పూర్తిచేసి ఫుల్-టైం ఫోటోగ్రాఫర్ని అయిపోయా. ఈ విషయం నాన్నకి పెద్దగా నచ్చకపోయినా అడ్డు చెప్పలేదు. మామ చాన్నాళ్ళ తరువాత పిల్లలని తీసుకొని ఇండియాకొచ్చాడు. అమ్మమ్మ తాతలు తమ వారసులను చూసుకొని మురిసిపోయారు. కొడుకు ఎప్పటికన్నా తమ దగ్గరకు వచ్చేస్తాడని నమ్మినవాళ్ళకి, కొడుకిక చుట్టపుచూపు గానే రాగలడని అర్థం చేసుకోడానికి చాన్నాళ్ళే పట్టింది. వారూ అమెరికాలో సర్దుకోలేరని నిర్ణయించేసుకొని ఆ ఆలోచనలు కట్టి బయట పడేసారు. కొడుకొచ్చినప్పుడే పదివేలని సర్దిచెప్పుకున్నారు. మామని కలిసి చాలా ఏళ్ళు కావడంతో ముందు కొంచెం జంకాను. కానీ రెండు రోజుల్లో మొహమాటం పటాపంచలైపొయింది. మామ నాకోసం తెచ్చిన హెన్రి కార్టియర్-బ్రెస్సో పుస్తకం చూసి నివ్వెరపోయాను. ఇన్నేళ్ళ తరవాత, ఇంత దూరం తర్వాత కూడా తనను ఒకప్పుడు హీరో వర్షిప్ చేసిన అల్లుడిని ఎలా మంత్రముగ్ధుడ్ని చేయాలో మామకే తెలిసింది. ఇదే మాటంటె నవ్వాడు.
“నేనూ ఇవన్నీ చేసొచ్చినవాడినేరా. ఇంక చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ సంగతులు”, అని మాట మార్చాడు.
“దాని గురించొద్దు మామ”
“ఎందుకు రా? ఏమయింది?”
“బ్రేకప్. వదిలెయ్”
మళ్ళీ ఆ ప్రస్తావనెత్తలేదు.
తను అమెరికాకు తిరిగి వెళ్ళిపోతున్న రోజు మళ్ళీ దాని గురించి రెండు మాటలన్నాడు.
“ఇప్పుడు నీకు బాధగా ఉంటుంది, నాకు తెలుసు. జీవితంలో ఇలాంటి అమ్మాయి ఇంక దొరకదు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ అమ్మాయి కారణాలు ఆ అమ్మాయికుండుంటాయి. కానీ ఎవరి కోసమో నీ ప్రవృత్తిని మార్చుకోకు. ఇంకో అమ్మాయి వస్తుంది దానికి ఢోకా లేదు. ఇప్పుడు నీలో ఎంత బాధ ఉన్నా అది తొలిగిపోతుంది. ఇది నిజం. నచ్చిన పని చేయి. మిగతా విషయాలన్ని వాటంతటవే వస్తాయి. ఒక వయసు దాటాక compromise లూ, sacrifice లూ తప్పవు. ఇప్పుడైనా నీకిష్టమొచ్చినట్టుండు. డబ్బులేమన్నా కావాల్సొస్తే అడుగు,” అని చెప్పాడు.
తను వెళ్ళిపోతున్నప్పుడు చూస్తూ ఉండిపోయా. తనంటే ఎందుకంత ఇష్టమో ఆ రోజు కొంత అర్థమైనట్టనిపించింది.
అక్క పి.జి. తర్వాత ఉద్యోగం చేయడంతో నాన్న మీద ఆర్థిక భారం తగ్గడమే గాక నాక్కూడా వెంటనే డబ్బు సంపాదించాల్సిన అవసరం పడలేదు. ఆ రోజుల్లో ఎవడైనా తిండి పెట్టి, ప్రయాణం చార్జీలిస్తానంటే అసైన్మెంటు మీద వెళ్ళిపోయేవాడిని. ఎక్కడెక్కడికో ప్రయాణాలు. రోజూ కొత్తవారితో పరిచయాలు. ఏది దొరికితే అది తిని, ఎక్కడ అలిసిపోతే అక్కడే పడుకునేవాడిని. రెండు జతల బట్టలు, నా కెమెరా కిట్. ఓ నెలా రెణ్ణెళ్ళు ఇలా తిరిగి బక్కచిక్కి, గడ్డం పెరిగి, ఎండలో తిరిగి తిరిగి నల్ల బడిన కొడుకుని అమ్మ ఒక పదిహేను రోజుల పాటు మేపి సభ్య సమాజానికి పనికొచ్చేలా చేసేది. కొంచం కోలుకున్నాక కొత్త అసైన్మెంటుకు సై.
ఆ రోజుల్లో మొహం మీద నవ్వు చెదిరేది కాదు. స్నేహితులకు నా కథలు చెబుతూంటే నోళ్ళెళ్ళబెట్టి వినేవాళ్ళు. వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నా, నా జేబులో ఇంకా చిల్లరే ఉన్నా నచ్చిన పని చేస్తున్నానన్న గర్వం ఉండేది. వాళ్ళ గొంతుల్లో ఈర్ష్య విన్నప్పుడు నేను వెళుతున్న దారి సరైనదే అని నమ్మకం కలిగేది.
ఇలా ఒక మూడునాలుగేళ్ళు తిరిగాక బోరు కొట్టి ఫ్రీలాన్స్ వదిలేసి ఆఫీసుకెళ్ళే ఉద్యోగంలో చేరా. బానే ఉండింది, అదీ కొత్త అనుభవమే కదా. అక్క పెళ్ళి కుదిరింది. లవ్ మారేజ్. అబ్బాయి ‘యోగ్యుడని’ నాన్న ఒప్పేసుకున్నాడు. తను నాకు ముందునుంచే తెలుసు. అక్కంటే చాలా ఇష్టం. దానితో అది సంతోషంగా ఉంటుందని నమ్మకం కలిగింది. పెళ్ళి తరువాత వాళ్ళు అమెరికా వెళ్ళిపోవడంతో అమ్మా నాన్నల దగ్గరగా నేను హైదరాబాద్ వచ్చేసా.
రోజులు బానే గడుస్తునాయి. ఉద్యోగంలో కొంత మోనాటొనీ ఏర్పడడంతో మారదామా అని ఆలోచిస్తున్నా. నాన్న వాళ్ళు ఇన్నిన్నేళ్ళు ఒకే ఉద్యోగం ఎలా చేసేవారో తెలియడంలేదు. అమ్మేమో పెళ్ళి చేసుకోమంటోంది. నేను ఇప్పుడప్పుడే ఆ ప్రస్తావన ఎత్తొద్దని చెప్పేసా. అసలు ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయంటే మామ వస్తున్నాడు. మొన్నే అక్కకి కొడుకు పుట్టాడు. అక్కడ అమెరికాలోనే. కానీ వాడి బారసాల ఇక్కడ చేద్దామని వస్తున్నారు. తాత ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడంతో తాతను కూడా చూసినట్టుంటుందని మామ కూడా వస్తున్నాడు.
ఇపుడు నేనూ మామనైపోయాను. అదొక వింత అనుభూతి. తెలియకుండానే పెద్దరికం వచ్చేసిందనిపిస్తోంది. కానీ అక్కావాళ్ళు అమెరికాలో ఉంటారు. ఆ బుడ్డోడికి మామ ఉన్నాడని తెలుస్తుంది కానీ మామ చేతుల్లో పెరగడు. వాడి వల్ల వాడి మామ తిట్లుతినడు. వాడికి వాడి మామ హీరో కాడు. ఇవన్నీ ఆలోచిస్తే కొంచం బాధేసింది.
అమెరికా మేళం దిగనే దిగింది. మా అమ్మ ఇన్నాళ్ళూ కొడుకు మీద వలక బోసిన ప్రేమ మనవడి మీదికి మళ్ళించింది. అక్క కొడుకుని అమ్మకప్పగించేసి ఫుల్ టైం రెస్ట్ తీసుకోవడం మొదలెట్టింది.
బారసాలకి నేనే దగ్గరుండి అన్నీ ఏర్పాట్లు చేసా. వాడి కోసం ఏమన్నా చేసే అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అని.
బారసాల రోజు ఫంక్షన్ హాల్ నిండిపోయింది. అందరి మొహాలూ సంతోషంతో వెలిగిపోతున్నాయి. నేను దూరంగా నుంచొని అంతా తీక్షణంగా పరిశీలిస్తున్నాను. ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని కాస్త దూరం నుండి చూస్తూ ఫ్రేం చేసుకోడానికి ఏ కంపోసిషన్ బాగుందో, ఎలా చూపిస్తే అందంగా కనబడుతుందో అని ఆలోచించడం అలవాటైపోయినట్టుంది. మామ పక్కనొచ్చి నుంచోవడం కూడా గమనించలేదు.
“ఏరా! ఏదో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నావు. ఏంటి విషయం,” అనడిగాడు.
“ఏం లేదు మామ, తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. అక్క పెళ్ళి మొన్నే అయినట్టుంది అప్పుడే దానికొక కొడుకు,” అన్నాను.
“రోజు లేవిట్రా, తెలియకుండా ఏళ్ళు గడిచిపోతాయి. నువ్వు ఇంకా నిన్నగాక మొన్న నన్ను ఆ జురాసిక్ థీమ్ పార్క్ కు ఛావగొట్టి తీసుకెళ్ళినట్టుంది”
“ఏ జురాసిక్ పార్క్ మామ– ఓ అదా!”, అని గుర్తొచ్చి నవ్వాను, “ఎన్నేళ్ళ కింద కదా. మరుసటి రోజు నాకు ఎగ్జాం, నీ బండి రిపెయిర్, తాత మోపెడ్ మీద ఎక్కడో పటాన్ చెరు పొయాం కదా.. జమానా అయింది”, అన్నాను.
మామ ఐస్క్రీం తింటుంటే గమనించాను: మీసంలో తెలుపు, కళ్ళ చుట్టూ క్రో-ఫీట్- ముసలితనపు ఛాయలు.
“ముసలోడివి అయిపోతున్నావు మామ”, అన్నాను పెద్దగా.
మామ నవ్వుతూ, “అది బాల నెరుపు లేరా”, అన్నాడు.
“అన్నట్టు మరిచిపోయా. మొన్నే అమ్మమ్మ నీ కంచం నాకిచ్చేసింది. మీ మామ నీకిచ్చింది. ఎప్పడి నుండో దాంట్లోనే తింటున్నాను కానీ, నీ కంచమే. ఇప్పుడు నాదట”
“ఆ బాదాం షేపు కంచమా? మా మామ నేను డిగ్రీ పాస్ అయిన తరవాత ఇచ్చాడు. వాళ్ళ మామకు వాళ్ళ మామ ఇచ్చాడని. జాగ్రత్తరా బాబూ! ఆ కంచానికి స్వతంత్ర భారత దేశనికన్నా పొడుగు చరిత్ర ఉంది.”
నేను నవ్వి, “ఇప్పుడీడు పుట్టాడుగా, వారసత్వానికి ఇంకో తరానికి కూడా డోఖా లేకుండ పోయింది”, అని ఊయల చుట్టూ గుమిగూడిన జనాన్ని, కళకళాడుతున్న అక్కని, సంతోషంతో మొహాలు వెలిగిపోతున్న అమ్మానాన్నలను చూసి గుండె బరువెక్కింది. నాక్కూడా తండ్రి కావాలనిపించింది. కానీ దాని కన్నా ముందు మామని– ప్రపంచంలో అత్యుత్తమ మామ అవ్వాలన్న కోరిక లేదు కానీ నేను నా మామని చేసిన హీరో వర్షిప్ లో ఓ పదో వంతు ఈ బుడ్డోడు నన్ను చేస్తే చాలనిపించింది. చూస్తూ ఉండిపోయాను.
మామ నా భుజం మీద చేయివేసి, “బాబూ చిన్న సైజు తత్వవేత్తగారూ, మీ దీర్ఘ తత్వచింతన అయిపోతే, పోయి గులాబు జామున్ తెచ్చుకుందాం,” అని కదిలాడు.
నేనో చిన్న నవ్వు నవ్వేసి మామ వెంట నడిచాను.
*

No comments:
Post a Comment