Saturday, April 22, 2017

నిన్నుజూసి నాక్ చానా జెలస్ ఫీల్ ఐతుంది రా

లాస్ట్ 10 డేస్ ల నేను పెళ్ళిచూపులు నాలుగు సార్లు చూశ్న. ఏమన్నా సైన్మా నా అది. ఫిదా వాయ్ నీ మీద. వెస్ ఆండర్సన్ తీసిన బాటల్ రాకెట్ గురించి స్కొర్సెసె ఒక చోట అంటడు, Here was a picture without a trace of cynicism, that obviously grew out of its director's affection for his characters in particular and for people in general. A rarity. నీ సినిమా చూసి నాక్ అదే ఫీలింగ్ కలిగింది. ఎంత ఇష్టంగ రాసినవ్ ప్రతీ సీన్ అని. మొన్న రాత్రి స్కూల్ ఫ్రెండ్ గాంతో మాంచి హై మీద పొద్దుగాల మూడింటిదాక డిస్కషన్ పెట్టినా నువ్ ఎంత తోప్ అని. అంత పాషన్ తోటి దేని గురించన్నా మాట్లాడి చాలా ఏళ్ళైపోయింది. చిత్ర వాళ్ళ బామ్మ ఒక్క డయలాగ్, "దీనికి అన్నీ పెళ్ళిచూపులు ఆటలా అయిపోయాయి. నా సీరియళ్ళన్నీ మిస్ అయిపోతున్నాయి", చాలు నీ ఫిల్మ్ మేకింగ్ ఎంత సీరియస్ ఓ చెప్పటానికి.

ప్రతీ కారెక్టర్ కి ఒక ఆర్క్. పెళ్ళిచూపులు చూసేంత వరకూ నాకు స్ట్రైక్ కాలేదు వేరే సినిమాల్లో సీన్స్ అంత ఫ్లాట్ గా ఎందుకు ఉంటాయో- ఈ సినిమాలో ప్రతీ కారెక్టర్ వాడి ప్రమంచంలో వాడుంటాడు. ఈ స్క్రీన్ రైటింగ్ గురువులు చెప్పినట్టు నువ్వు ప్రతీ పాత్రకీ ఒక మోటివ్, ఒక పర్సనాలిటీ ట్రైట్, ఒక ఓబ్స్టకల్ ఇచ్చావ్. అసలు సినిమా అంటే ఇలా రాయాలి అన్నంత అక్కంప్లిష్డ్ రచన ఇది.

కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఈ పర్ఫెక్షన్ కొంచెం constraining గా అనిపించింది. నీ జర్నీ చూసిన రోజే అనిపించింది, వీడెవడో నాచురల్ ఫిల్మ్ మేకర్, ఆ ఐ ఉంది అని. సైన్మా చూసి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పాటికి కూడా నెలకి ఒకసారైనా ఆ లేపుకెళ్ళే సీన్ గురించి మాట్లాడతా. ఇప్పుడు పెళ్ళిచూపులు. ఎక్కడ్నో ఒకసారి చదివినా నీకు మణి రత్నం అంటే చాలా ఇష్టం అని. ఆ ట్రేసెస్ కనబడతాయి- అర్బన్ మధ్య తరగతి సెన్సిబిలిటి. బరద్వాజ్ రంగన్ మణి రత్నాన్ని మన లాస్ట్ మెయిన్-స్ట్రీం auteur అంటాడు. అతను అప్పటికి నీ వర్క్ ఇంకా చూడలేదనుకుంటా. పర్సనల్లీ, ఐ విష్ నీ మూవీస్ కుడ్ బి స్లైట్లీ zanier. Talking about a Nolan film, someone wrote that his films are like the click of a perfectly made box. నీ సినిమాలు కూడా అట్లనే. నాకు ఆ పర్ఫెక్షన్ slightly off-putting కానీ అది నా ప్రిఫరెన్స్ మాత్రమే. నాకు అనురాగ్ కశ్యప్, సెల్వరాఘవన్ ల మెస్సీనెస్ ఇష్టం.

సో హా, ఏం మాట్లాడుతున్నం? జెలసీ గురించి. పెళ్ళిచూపులు ఫస్ట్ డే చూసి గట్టుగాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, "చూడు బా సినిమా. అల్టిమేట్ ఉంది. నువ్వు తీద్దాం అనుకున్న సినిమా ఈడు తీసేసాడు". మన గురించి, మామూలు మనుషుల గురించి ఎందుకు రా ఎవడు సినిమాలు తీయడు అన్న నా పెరీనియల్ ఫిర్యాదు కి ఆన్సర్ ఈ సినిమా. కళ మనిషిని ఇన్స్పైర్ చేయాలి అంటరు కదా, నీ సినిమా నన్ను ఇన్స్పైర్ చేస్తది. నా సినిసిస్మ్ ని కాసెపటికైనా పోగొడ్తది. జనాలు ఎంత ఇష్టంగా, ఓన్ చేస్కొని ఈ సినిమాని తమ సొంత సినిమాలా నలుగురికీ చూడమని చెప్పారో చూస్తే చాలా మంచిగ అనిపించింది.  ఎట్ల తీష్నవ్ బాబు ఇంత మంచి సినిమా?

పండగ పూట కుటుంబం అంతా అన్నాలు తినేసి ఈ.టివి లో మిస్సమ్మ, గుండమ్మ కథ కబుర్లు చెప్పుకుంటూ చూస్తరు కదా, అట్ల పాతికేళ్ళ తరవాత నీ సినిమాని చూస్తరు. తెలుగోళ్ళ కల్చరల్ జిందగీల నీ సినిమాలు ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నీ గురించి తెల్వద్ కానీ నాక్ మాత్రం మస్త్ గర్వంగున్నది; అదేదో నేనే తీసినట్టు.

అదీ ముచ్చట. నేనేదన్నా ఇట్ల చేయగలనూ, చేస్తానూ అన్న నమ్మకం పోయింది. ఏదో నిస్సత్తువ, సినిసిస్మ్, చిరాకు, రెస్ట్ లెస్నెస్స్. కానీ ఆ ఎమోషన్స్ ని కాసేపటికైనా దూరం పంపింది నీ సినిమా. దానికి థాంక్స్. If they’re responding to your work and your work is really personal, then reading you is another way of meeting you, అంటాడు లిప్స్కీ ఫాస్టర్ వాలేస్ తో. నేనూ ఆ మాట తో ఏకీభవిస్తాను. నీ గురించి అంతా తెలియక పోయినా నీ innate dignity, honesty ప్రతిబింబిస్తాయి నీ సినిమాలో.

నాక్ జెనెరల్ గా తారీఫ్ చేయటం ఈసీగ రాదు. నా ఈగో అడ్డొస్తది. కానీ నీ కేస్ లో ఆ ఈగో annihilate అయిపోయింది. మంచిగ రాసిన పుస్తకం, సినిమా చదివితే, చూస్తే అనిపిస్తది బానే తీసాడు కానీ మనం భీ తీయొచ్చు పెద్ద గొప్పేంది అని. కానీ కొన్ని అట్లా ఉండవు. అవి మన రేంజ్ కాదు అని సమఝ్ అయిపోతది. అదీ ఒక రకంగ మంచిదే- ఖులే దిల్ తోని మెచ్చుకుంటం. అది నువ్వు నాకు చేసిన పెద్ద ఎహ్సాన్. జెన్యూన్ మంచితనాన్ని, స్వార్థం లేని ప్రశంసని నా నోట్లో నుండి రావటం చూసి నేనే ఆశ్చర్యపోయా.

నేన్ జీవితంలో ఏదన్నా, ఎప్పుడైనా ఇష్టంగా, ప్రేమగా, గర్వంగా సృష్టిస్తే దానికి పెద్ద స్ఫూర్తి నీ సినిమాలు అవుతాయి.

సలాం తరుణ్.

No comments: